ETV Bharat / bharat

భారీగా పెరిగిన మోదీ ఆస్తులు.. ఆ భూమిని దానం చేసిన ప్రధాని! - మోదీ ఆస్తులు

PM Modi Assets: భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. ఎంత ఆస్తులు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఏటా ఆయన తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఈసారి మరి మోదీ ఆస్తుల విలువ​ ఎంత పెరిగిందో తెలుసా?

pm modi assets
pm modi assets
author img

By

Published : Aug 9, 2022, 4:14 PM IST

PM Modi Assets: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్నారు. 2021-22 సంవత్సరంలో మోదీ చరాస్తుల విలువ రూ. 26.13 లక్షలు పెరిగినట్టు పీఎంఓ వెబ్​సైట్ వెల్లడించింది. గుజరాత్ రెసిడెన్షియల్ ప్లాట్‌లో ఆయనకు ఉన్న వాటాను విరాళంగా ఇచ్చారని, దీంతో ఆయన పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని పేర్కొంది. మోదీతో పాటు పలు కేంద్ర మంత్రుల ఆస్తుల జాబితాను ప్రకటించింది.
మార్చి 31, 2022 వరకు మోదీ చరాస్తుల విలువ రూ.2,23,82,504కు చేరిందని పీఎంఓ తెలిపింది. ఇందులో డిపాజిట్ల పెరుగుదల, ఆర్థిక సంస్థ స్థిరత్వం, నేషన్‌వైడ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లు, జీవిత బీమా కవరేజ్, బీమా పాలసీలు, నగదు ఉన్నాయని చెప్పింది.

పీఎంఓ వివరాల ప్రకారం.. మోదీకి స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులు లేవు. సొంత వాహనం కూడా లేదు. ప్రభుత్వం నుంచి పొందే జీతాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటి వల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది. రూ.1.73 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఆయన చేతిలో ఉన్న నగదు విలువ తగ్గింది. గతంలో ఈ నగదు విలువ రూ. 36,900 ఉండగా అది రూ.35,250కు చేరింది.

పీఎంఓ వివరాల ప్రకారం పలు కేంద్రమంత్రుల ఆస్తుల విలువ..
రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ పేరిట రూ. 2.54 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఈ సారి ఆయన ఆస్తుల విలువ రూ.29.58 లక్షలు పెరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తులు రూ.1.62 కోట్ల నుంచి రూ.1.83 కోట్లకు పెరిగాయి. పురుషోత్తం రూపాలా ఆస్తుల విలువ రూ.7.29 కోట్లుగా ఉంది. జ్యోతిరాదిత్య సింధియా పేరిట రూ. 35.63 కోట్లు ఉండగా, రూ.58 లక్షల అప్పులు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తుల విలువ రూ.1.43 కోట్లు.

ఇవీ చదవండి: బిహార్​ రాజకీయంలో కీలక ట్విస్ట్.. నితీశ్ రాజీనామాకు ముహూర్తం ఫిక్స్!

నితీశ్​ ప్లాన్​కు భాజపా కౌంటర్.. ఆ ఎమ్మెల్యేలపై వేటు!.. మరి ప్రభుత్వం ఏర్పాటు ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.