సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించారు. పరీక్షలు రద్దైనందున ఈ సమయాన్ని సృజనాత్మకంగా వినియోగించుకోవాలని సూచించారు. పరీక్షలు ఏవైనా ఒత్తిడికి గురికావొద్దని అన్నారు.
కేంద్ర విద్యా శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థులు, వారి తల్లితండ్రులు దీనికి హాజరయ్యారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ఆకస్మికంగా హాజరై విద్యార్థులను ఆశ్చర్యపరిచారు. పరీక్షలు రద్దైనందున ఏం చేయాలనుకుంటున్నారని విద్యార్థులను అడిగారు మోదీ. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి గుర్తుంచుకోవాలని సూచించారు.
-
#WATCH PM Modi today surprised CBSE students and their parents when he joined a virtual session organized by the Education Ministry. He heard the issues and concerns of the students and their parents pic.twitter.com/M5hr3K3cEM
— ANI (@ANI) June 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH PM Modi today surprised CBSE students and their parents when he joined a virtual session organized by the Education Ministry. He heard the issues and concerns of the students and their parents pic.twitter.com/M5hr3K3cEM
— ANI (@ANI) June 3, 2021#WATCH PM Modi today surprised CBSE students and their parents when he joined a virtual session organized by the Education Ministry. He heard the issues and concerns of the students and their parents pic.twitter.com/M5hr3K3cEM
— ANI (@ANI) June 3, 2021
కరోనాను జయిస్తాం
పాఠశాలల్లో విద్యార్థులకు నేర్పించిన బృంద స్ఫూర్తి కరోనా రెండో దశలో దేశవ్యాప్తంగా కనిపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనాను జయిస్తామని ఇప్పుడు ప్రతిఒక్క భారతీయుడు చెబుతున్నాడని చెప్పారు. విద్యార్థులందరూ దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
పరీక్షల రద్దు ప్రకటనపై తమ అభిప్రాయాలను పలువురు విద్యార్థులు పంచుకున్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి చెప్పారు.
ఇదీ చదవండి- కరోనాకు 'మందు'గా పవిత్రజలం- ఎగబడ్డ జనం