ETV Bharat / bharat

'కరోనాపై పోరులో భారత్- ఆస్ట్రేలియా బంధం కీలకం' - 'భారత్​- ఆస్ట్రేలియా సర్క్యూలర్ ఎకానమీ హాకథాన్'

'భారత్​- ఆస్ట్రేలియా సర్క్యూలర్ ఎకానమీ హాకథాన్' కార్యక్రమంలో​ ప్రధాని నరేంద్ర మోదీ.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సర్క్యూలర్ ఎకానమీ సమస్యలను అధిగమించేందుకు ఈ సమావేశం దోహదపడుతుందన్నారు.

PM addresses India-Australia Circular Economy Hackathon
కరోనాపై పోరాటంలో భారత్- ఆస్ట్రేలియా బంధం కీలకం
author img

By

Published : Feb 19, 2021, 11:12 AM IST

Updated : Feb 19, 2021, 12:55 PM IST

'భారత్​- ఆస్ట్రేలియా సర్క్యూలర్ ఎకానమీ హాకథాన్' కార్యక్రమంలో​ ప్రధాని నరేంద్ర మోదీ.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు. ఈ హాకథాన్​తో ఇరు దేశాలు ప్రతిపాదించే సృజనాత్మక పరిష్కారాలు.. సమస్యలను అధిగమించేందుకు దోహదపడతాయన్నారు.

సమస్యల నుంచి గట్టెక్కేందుకు సర్క్యూలర్​ ఎకానమీ విధానం కీలకమని అభిప్రాయపడ్డారు మోదీ. రీసైక్లింగ్, వ్యర్థాలను తొలగించడం... దీని ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవటం మన జీవనశైలిలో భాగం కావాలన్నారు.

భారత్- ఆస్ట్రేలియా బలమైన బంధం.. కరోనా తర్వాత ప్రపంచంలో ఏర్పడ్డ పరిస్థితులను మార్చటంలో ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు ప్రధాని. ప్రకృతి మనకు అందించే వనరులకు మనం అధినేతలం కాదన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. అవి భావి తరాలకు అందించేందుకు కృషి చేయాలన్నారు.

"ఈ హాకథాన్​ భారత్, ఆస్ట్రేలియా విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీస్తుంది. విద్యార్థుల ఆలోచనలు సర్క్యూలర్​ ఎకానమీ సమస్యలను పరిష్కరించటంలో కీలక పాత్ర పోషిస్తాయి. విద్యార్థుల శక్తి.. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించటం, కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టడంలోనే ఉంది. విద్యార్థుల శక్తి, సృజనాత్మకతపై నాకు నమ్మకం ఉంది."

-- ప్రధాని నరేంద్ర మోదీ

సర్క్యూలర్​ ఎకానమీపై ఓ హాకథాన్ ఏర్పాటు చేయాలన్న దానిపై తాను, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ గతేడాది జూన్​లో చర్చించామన్నారు ప్రధాని మోదీ.

సర్క్యూలర్ ఎకానమీ అంటే?

వ్యర్థాలను తిరిగి ఉత్పత్తి ప్రక్రియలో వాడటం. ఆ వ్యర్థాలను పాడేయకుండా.. వాటి నుంచి నూతన ఉత్పత్తులను తయారు చేయడాన్ని సర్క్యూలర్​ ఎకానమీ అంటారు.

ఇదీ చదవండి : జల విలయం- 62కు చేరిన మృతులు

Last Updated : Feb 19, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.