ట్రాన్స్‌జెండర్ల నుంచి రక్తం స్వీకరించకూడదంటూ 2017లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో శుక్రవారం వ్యాజ్యం దాఖలయింది. రక్తదాతల జాబితా నుంచి ట్రాన్స్‌జెండర్లతో పాటు, పురుష స్వలింగ సంపర్కీయులు, మహిళా సెక్స్‌వర్కర్లను తొలగించింది. హెచ్‌ఐవీ పాజిటివ్, హైపటైటిస్ వ్యాధులు వ్యాపించకుండా ఈ నిర్ణయం తీసుకొంది.
అయితే శాశ్వతంగా వారిపై నిషేధం విధించడం హక్కులకు భంగకరమంటూ మణిపుర్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త ఈ దావా వేశారు. దీనిపై సమాధానం చెప్పాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి: విమానం బయల్దేరే ముందు ప్రయాణికుడి షాక్