ETV Bharat / bharat

ఎస్పీ నేత పీయూష్ జైన్ అరెస్టు- మరో రూ.10 కోట్లు సీజ్ - పీయూష్ జైన్ కాన్పుర్

Piyush jain arrested: ఉత్తర్​ప్రదేశ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీల నుంచి మరో రూ.10 కోట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు సీజ్ చేసిన మొత్తం రూ.187.45 కోట్లకు చేరింది. సీజీఎస్​టీ చట్టం ప్రకారం పీయూష్​ను అరెస్టు చేసి.. విచారణ జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు.

piyush-jain-arrested
piyush-jain-arrested
author img

By

Published : Dec 27, 2021, 11:03 AM IST

Piyush jain arrested: ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​కు చెందిన పర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్​కు చెందిన ప్రాంతాల నుంచి మరో రూ.10 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీఎస్​టీ ఎగవేత కేసులో ఆయన ఇళ్లు, ఫ్యాక్టరీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు... కన్నౌజ్​లోని ఫ్యాక్టరీ నుంచి రూ.5 కోట్లు, పీయూష్ నివాసం నుంచి మరో రూ.5 కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు విలువ రూ.187.45 కోట్లకు చేరిందని చెప్పారు.

Kanpur IT raid 150 crore

సీజీఎస్​టీ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం పీయూష్​ను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. జైన్​ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఆయన స్టేట్​మెంట్ రికార్డు చేశామన్నారు. నగదుతో పాటు రూ.కోట్లు విలువ చేసే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శాండల్​వుడ్ ఆయిల్, పర్ఫ్యూమ్​ వంటి ఉత్పత్తులను సీజ్ చేశామని చెప్పారు.

తనిఖీల్లో భాగంగా తొలిరోజు తనిఖీ చేస్తున్న సమయంలో.. పీయూష్ తన ఇంటి నుంచి పారిపోయాడని అధికారులు తెలిపారు. అనంతరం పలుమార్లు ఫోన్లు చేయగా.. రెండు గంటల తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు.

ఎస్పీ నేత!

Piyush Jain Samajwadi party: పీయూష్‌ సమాజ్‌వాదీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. ఇటీవల సమాజ్‌వాదీ సెంట్‌ పేరుతో రూపొందించిన సుగంధ ద్రవ్యాన్ని ఈయన కంపెనీలోనే తయారు చేశారు.

ఈ కేసుకు సంబంధించి కాన్పుర్‌ సహా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, గుజరాత్‌, ముంబయిల్లో కూడా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎస్పీ నేత ఇంట్లో నల్లధనం.. విలువ రూ.177 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.