ETV Bharat / bharat

'కశ్మీర్​లో 2019 ఆగస్టు ముందు పరిస్థితులు కావాలి'

author img

By

Published : Feb 17, 2021, 5:14 AM IST

జమ్ముకశ్మీర్​లో 2019 ఆగస్టు ముందు నాటి పరిస్థితిని నెలకొల్పాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. కశ్మీర్ సహ దేశ ప్రజలపై కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. బెంగళూరులో 21 ఏళ్ల యువతిని అరెస్టు చేశారు. రైతులతో ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నామని పేర్కొన్నారు.

PDP demanding restoration of pre-August 2019 status for J&K: Mehbooba Mufti
'కశ్మీర్​కు రాష్ట్ర హోదా మాత్రమే కాదు.. అదీ కావాలి'

జమ్ము కశ్మీర్​కు రాష్ట్ర హోదా మాత్రమే తాము కోరడంలేదని పీపుల్స్​ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. 2019 ఆగస్టు ముందు నాటి పరిస్థితులను కల్పించాలని డిమాండ్ చేశారు.

"మేము జమ్ము కశ్మీర్​కు రాష్ట్ర హోదా అడగటంలేదు. 2019 ఆగస్టు 5కు ముందు నాటి పరిస్థితులను నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నాం. దేనికోసమైతే వేల మంది యువత త్యాగాలు చేశారో, లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయో, కోట్ల రూపాయులు వెచ్చించారో.. ఆ కశ్మీర్ అంశం పరిష్కారం కోరుతున్నాం. దానికోసం పాకిస్థాన్, జమ్ముకశ్మీర్​ ప్రజలతో కేంద్రం చర్చించాలి."

- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి

నేషనల్ కాన్ఫరెన్స్​ నేత హిలాల్ లోన్ అరెస్టుపై స్పందిస్తూ.. 'దేశంలో జంగిల్ రాజ్ (ఆటవిక పాలన) నడుస్తోంది. కశ్మీర్​లో దాని తీవ్రత ఎక్కువగా ఉంది. కశ్మీర్​ సహ దేశ ప్రజలపై భాజపా సర్కారు క్రూరంగా వ్యవరిస్తోంది. వారి దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటించే వారిని ఏం చేస్తుందో చూస్తునే ఉన్నాం. బెంగళూరులో 21 ఏళ్ల యువతిని అరెస్టు చేశారు. రైతులతో ఎలా వ్యవహరిస్తున్నారో మనకు తెలుసు.' అని ముఫ్తీ అన్నారు.

కశ్మీర్​ ప్రజల ఆకాంక్షల కోసమే గుప్కార్​ కూటమి పనిచేస్తుందని, వారు కోరుకున్నానాళ్లు కూటమి కొనసాగుతుందని ముఫ్తీ స్పష్టంచేశారు. ఆర్టికల్​ 370 రద్దు సమయంలో నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ సహా రాజకీయ ఖైదీలు, యువతను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో విదేశీ రాయబారుల పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.