ఝార్ఖండ్‌లోని గిరిధి జిల్లాలో విషాదం నెలకొంది. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఓ వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని జమాతాడా పంచాయతీ పరిధిలోని పీడితాండ్కు చెందిన టుకావన్ అనే వ్యక్తికి గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. దాదాపు 15 నిమిషాల వరకు ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులోకి దొరకలేదు. కాసేపటి తర్వాత ఓ వైద్యుడు అక్కడికి వచ్చి టుకావన్ను పరీక్షించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, హుటాహుటిన మరో ఆస్పత్రికి తరలించాలని సూచించారు.
సమయానికి ఆంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆస్పత్రి సిబ్బంది పేషంట్‌కు కృత్రిమంగా ఆక్సిజన్ సరఫరా చేయడం ప్రారంభించారు. అయితే కరెంట్ కోత వల్ల మధ్యలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. ఇంధనం లేని కారణంగా ఆస్పత్రి సిబ్బంది జనరేటర్‌ను కూడా ఆన్ చేయలేదు. దీంతో సమయానికి ఆక్సిజన్ అందక దాదాపు 20 నిమిషాలు మృత్యువుతో పోరాడిన టుకావన్ మృతి చెందాడు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబసభ్యులకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు మద్దతు పలికారు. టుకావన్ మృతికి కారణమైన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కంప్యూటర్ క్లాస్ నుంచి వస్తున్న యువకుడు దారుణ హత్య.. గేదెనూ వదలని కామాంధుడు!
మాజీ సీఎం, ఎమ్మెల్యే వర్గాల మధ్య గొడవ కుర్చీలతో కొట్టుకున్న కార్యకర్తలు