ETV Bharat / bharat

ఒకే వ్యక్తిలో బ్లాక్ ఫంగస్​​​, వైట్​ ఫంగస్! - uttar pradesh black fungus cases

ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో ఓ రోగికి ఒకేసారి శిలీంధ్రవ్యాధులైన బ్లాక్​, వైట్​ ఫంగస్​లు సోకాయి. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

black and white fungus, బ్లాక్​ ఫంగస్​ కేసులు ఉత్తర్​ప్రదేశ్
బ్లాక్​ ఫంగస్​ కేసులు
author img

By

Published : May 26, 2021, 3:39 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో ఓ రోగికి ఒకేసారి బ్లాక్​, వైట్​ ఫంగస్​లు సోకాయి. బ్లాక్​ ఫంగస్​తో బాధపడుతున్న వారిలో వైట్​ ఫంగస్​ సోకడం ఇదే తొలిసారి. ప్రస్తుతం వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.

​బిజ్​నోర్​కు చెందిన బాధితుడు కంటిచూపు సమస్యతో తమను సంప్రదించాడని ఆనంద్​ హాస్పిటల్​ వైద్యులు డాక్టర్​ పునీత్​ భార్గవ తెలిపారు. బ్లాక్​ ఫంగస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన అతనికి పరీక్షలు నిర్వహించగా వైట్​ ఫంగస్​ కూడా సోకినట్లు నిర్ధరణ అయిందని వెల్లడించారు. ​ బ్లాక్​ ఫంగస్​ అతని సైనస్​ ద్వారా శరీరంలోకి వ్యాపించిందని.. అయితే తక్షణమే చికిత్స ప్రారంభించిన కారణంగా అతని కంటిచూపుకు ఎలాంటి ముప్పు కలగలేదని స్పష్టం చేశారు. వైట్​ ఫంగస్​ను చికిత్స ద్వారా నివారించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి : 'రంగు గురించి భయపడొద్దు.. కారణం తెలుసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.