మహిళ రిక్షా డ్రైవర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కామాంధుడు. తన కోరిక తీర్చాలంటూ బెదిరించాడు. అనంతరం తన బట్టలు విప్పుకుని.. మహిళ వెంట పరిగెడుతూ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలో ఈ ఘటన జరిగింది. శంకర్ మఠ్ హడప్సర్ ప్రాంతానికి చెందిన నిఖిల్ అశోక్ మెమ్జాడే(30) అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలు పుణెకు చెందిన మహిళ (38). రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తోంది. డిసెంబర్ 26న.. ఆ మహిళ రిక్షాను.. నిందితుడు నిఖిల్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎక్కాడు. అనంతరం కత్రాజ్ ఘాట్‌కు వెళ్లాలని మహిళకు చెప్పాడు.
కొద్ది దూరం ప్రయాణించిన తరువాత రిక్షాను ఆపమని చెప్పాడు నిందితుడు. అప్పుడు సమయం పది గంటలు అవుతోంది. చుట్టూ చీకటిగా ఉంది. దాన్నే అదునుగా తీసుకున్న నిందితుడు మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. తన లైంగిక కోరికను తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. అందుకు మహిళ నిరాకరించింది. దీంతో మహిళపై చేయి చేసుకున్నాడు నిఖిల్. బట్టలు విప్పుకుని మరీ మహిళను వేధింపులకు గురిచేశాడు.
భయపడిపోయిన మహిళ పరుగెత్తింది. అయినా నిందితుడు ఆమెను వదిలిపెట్టలేదు. కోరికను తీర్చాలంటూ ఆమె వెంటపట్టాడు. ఎలాగోలా అతడి నుంచి తప్పించుకున్న మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు నిఖిల్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు.
ప్రైవేటు పార్ట్‌ను దారంతో కట్టిన సీనియర్లు..
మూడో తరగితి విద్యార్థిపై.. నలుగురు సీనియర్ విద్యార్థులు దారుణంగా ప్రవర్తించారు. తీవ్రంగా దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా అతడి మర్మాంగాన్ని దారంతో కట్టారు. చాలా రోజులు ఆ విద్యార్థి ఈ బాధను భరించాడు. భయంతో ఎవ్వరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బాధిత బాలుడు కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లోని అటల్ ఆదర్శ్ విద్యాలయంలో మూడో తరగతి చదువుతున్నాడు. అతడికి ఎనిమిదేళ్లు. తన కుటుంబంతో కలిసి కోట్ల ముబారక్‌పుర్‌లోని పిలాంజి గ్రామంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతడి తల్లిదండ్రులు ప్రైవేటు ఉద్యోగులు.
ఎప్పటిలాగే డిసెంబర్ 24 బాధిత బాలుడు పాఠశాలకు వెళ్లాడు. అతడు టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో 16 సంవత్సరాలు ఉన్న నలుగురు సీనియర్ విద్యార్థులు బాధితుడిని అడ్డుకున్నారు. అనంతరం అతడిపై దాడి చేశారు. అంతటితో వారు ఆగలేదు. ఒకడు చేతులు పట్టుకున్నాడు. మరొగడు కాళ్లు పట్టుకున్నాడు. ఇంకొకడు గేటు వద్ద కాపలా ఉన్నాడు. మరో బాలుడు ప్రైవేటు పార్ట్‌ను దారంతో కట్టాడు.
అనంతరం దారాన్ని అలాగే ఉంచుకోవాలని బాలుడిని హెచ్చరించారు నిందితులు. విషయం ఎవరికైనా చెబితే తన తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ బాలుడు విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నొప్పిని భరించలేని బాలుడు.. తర్వాత రెండు రోజులు స్కూల్‌కు వెళ్లలేదు.
బుధవారం సాయత్రం కొడుకు స్నానం చేసేటప్పుడు.. మర్మాంగం దారంతో కట్టి ఉండటాన్ని గమనించాడు బాలుడి తండ్రి. ఏం జరిగిందని కొడుకును అడగగా జరిగినదంతా తండ్రికి చెప్పాడు బాలుడు. దీంతో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధిత బాలుడి తండ్రి. అనంతరం బాలుడిని ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స తరువాత బాలుడు గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
శునకానికి ఉరి వేసి హత్య..
శునకాన్ని ఉరి వేసి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. మరో శునకాన్ని సైతం చంపేశారు. అనంతరం రెండు శునకాల మృతదేహాలను ఓ ఖాళీ ప్రదేశంలో పడేశారు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకా సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 27న చెట్టుకు ఉరివేసి ఉన్న శునకాన్ని గమనించిన ఓ మహిళ.. పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శునకాల మృతదేహలను స్వాధీనం చేసకున్నారు.
శవ పరీక్షల కోసం వాటిని పశువైద్యశాలకు పంపించారు. ఒక కుక్కను ఉరివేసి చంపారని శవ పరీక్షలో తేలింది. మరొక నివేదిక రావాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసున్నారు పోలీసులు.
ఈ దారుణంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు.