పార్లమెంట్లో లఖింపుర్ రగడ- ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా
లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలపై పార్లమెంట్ ఉభయ సభలు హోరెత్తాయి. నిరసనలతో మధ్యాహ్నానికి వాయిదా పడిన లోక్సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా.. ఆందోళనలు కొనసాగించారు విపక్ష సభ్యులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. విపక్షాల నినాదాలతో సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.
రాజ్యసభలో ఇదే తీరు కనిపించింది. లఖింపుర్ ఖేరి హింసపై చర్చ చేపట్టాలని, కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలని నిరసనలు చేపట్టారు విపక్ష నేతలు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.