ETV Bharat / bharat

'లోక్​సభ ఘటన' మరో నిందితుడు లలిత్ అరెస్ట్- కోల్​కతాతో కనెక్షన్​!- అతడే స్కెచ్ వేశాడా?

author img

By PTI

Published : Dec 14, 2023, 9:23 PM IST

Updated : Dec 14, 2023, 10:56 PM IST

Parliament Security Breach Accused : పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనకు సంబంధించిన కేసులో మరో నిందితుడు లలిత్ ఝాను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నలుగురు నిందితులను దిల్లీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వారికి వారంరోజులపాటు పోలీసు కస్టడీ విధించింది కోర్టు.

parliament security breach accused
parliament security breach accused

Parliament Security Breach Accused : పార్లమెంటులో అలజడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మరో నిందితుడు లలిత్‌ ఝాను దిల్లీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. లలిత్ ఝానే స్వయంగా పోలీస్ స్టేషన్​కు వచ్చి లొంగిపోయాడని దిల్లీ పోలీసులు తెలిపారు. అంతకుముందు లలిత్ షూ గురించి సంబంధిత వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి.

'లలిత్ ఝా కోల్‌కతాలోని బుర్రాబజార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. కోల్​కతా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడి వెళ్లి ఇంటి యజమానిని లలిత్ ఝా గురించి అడిగారు. లలిత్ సమయానికి అద్దె చెల్లించేవాడు కాదని అతడికి స్థానికులతో అంతగా పరిచయాలు లేవని చెప్పారు. ఎక్కువగా ఎవరితో లలిత్ మాట్లాడేవారు కాదని యజమాని చెప్పారు' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

'బంగాల్​లోని పురులియా జిల్లాలోని ఓ ఎన్​జీఓలో లలిత్ ఝా పనిచేసేవాడు. అయితే పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన కొన్ని వీడియోలను లలిత్ మరో యువకుడికి పంపాడు. దీంతో దిల్లీ పోలీసుల బృందం త్వరలో కోల్​కతాకు వచ్చే అవకాశం ఉంది. దిల్లీ క్రైమ్​ బ్రాంచ్​ కోల్​కతా పోలీసులకు సమాచారం అందించింది. అన్నివిధాలుగా దిల్లీ పోలీసులకు కోల్​కతా పోలీసులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు' అని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేగాక లలిత్ ఝా మరో ఇద్దరి స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

'నిందితులకి వారం రోజుల పోలీస్ కస్టడీ'
లోక్​సభలో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నలుగురు నిందితులను దిల్లీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ శిందే, నీలమ్ దేవికి న్యాయస్థానం వారం రోజులపాటు పోలీసుల కస్టడీ విధించింది. వాదనల సమయంలో నిందితులు తీవ్రవాద కార్యక్రమాలకు పాల్పడ్డారని, భయాన్ని ప్రేరేపించేందుకు యత్నించారని ప్రభుత్వ న్యాయవాది ఆరోపించారు. అందుకు నిందితులను 15రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని దిల్లీ కోర్టు స్పెషల్ జడ్జి హర్దీప్ కౌర్​ను కోరారు. ఈ క్రమంలో నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం(UAPA) కింద వారం రోజులపాటు కస్టడీని విధించింది దిల్లీ కోర్టు.

ఇది పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌పై జరిగిన దాడి అని న్యాయమూర్తికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. నిందితులు సందర్శకుల గ్యాలరీలో ఉండాల్సిన వాళ్లు అక్రమంగా లోక్​సభ ఛాంబర్​లోకి దూకారని పేర్కొన్నారు. అంతేగాక లోక్​సభలో తమ బూట్లలో ఉన్న స్మోక్ డబ్బాలతో వెదజల్లి నిరసనకు దిగారని చెప్పారు. లోక్​సభలో భద్రతా ఉల్లంఘన వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వెలికితీసేందుకు, ఈ ఘటనలో ఇంకెవరి ప్రమేయమైనా ఉందో? లేదో? తెలుసుకోవడానికి నిందితుల కస్టడీ అవసరమని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. 'నిందితులు లఖ్​నవూలో ప్రత్యేక బూట్లను తయారు చేయించారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. వారిని అలాగే విచారణ నిమిత్తం ముంబయి, మైసూర్, లఖ్​నవూ తీసుకెళ్లాల్సి రావొచ్చు' అన్నారు.

నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాది లేకపోవడం వల్ల కోర్టే డిఫెన్స్ లాయర్​ను ఏర్పాటు చేసింది. 15 రోజుల రిమాండ్ కోసం పోలీసుల చేసుకున్న దరఖాస్తును వ్యతిరేకించారు. నిందితులను విచారించడానికి రెండు లేదా మూడు రోజుల కస్టడీ సరిపోతుందని చెప్పారు. అయితే ఇరువురి వాదనలు ఉన్న దిల్లీ కోర్టు నిందితులకు వారం రోజుల పోలీసుల కస్టడీ విధించింది.

''లోక్​సభ ఘటన' వెనుక పెద్ద వ్యక్తులు, వారంతా తప్పించుకున్నారు!- తప్పు చేస్తే ఉరితీయండి!!'

'లోక్​సభ ఘటన'పై అట్టుడికిన పార్లమెంట్- 15 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్

Last Updated : Dec 14, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.