ETV Bharat / bharat

కశ్మీర్​ ఎన్నికల బరిలో మాజీ ఉగ్రవాది భార్య - DDC polls news updates

జమ్ముకశ్మీర్​లో జిల్లా అభివృద్ధి మండలి(డీసీసీ) ఎన్నికల్లో మాజీ ఉగ్రవాది భార్య బరిలోకి దిగారు. తాను నివసిస్తున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. శుక్రవారం జరుగుతున్న మూడో విడత పోలింగ్​లో ఆమె తలపడుతున్నారు.

Pakistani Wife of Ex militant  contesting DDC polls  in Kupwara District
కశ్మీర్​ స్థానిక ఎన్నికల బరిలో మాజీ ఉగ్రవాది భార్య
author img

By

Published : Dec 4, 2020, 9:23 AM IST

జమ్ముకశ్మీర్​లో స్థానిక ఎన్నికల్లో మాజీ ఉగ్రవాది భార్య పోటీ చేస్తున్నారు. కుప్వారా జిల్లాలో తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో జిల్లా అభివృద్ధి మండలి(డీసీసీ) బరిలోకి దిగుతున్నట్లు స్వతంత్ర అభ్యర్థి సౌమ్య సదా​ పేర్కొన్నారు. ఆమెతో పాటు ఆ స్థానంలో మరో 11 మంది మహిళలు పోటీ పడుతున్నారు. శుక్రవారం జరుగుతున్న మూడో విడత పోలింగ్​లో ఆమె తలపడుతున్నారు.

"ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కేవలం నా అభిప్రాయమే కాదు మహిళలందరి ఉద్దేశం. మహిళల ప్రతినిధిగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే నా లక్ష్యం. వారు తమ కాళ్లపై నిల్చొనేలా చేసి.. నిరుద్యోగితను పారదోలడానికి అందరితో కలిసి పని చేయలన్నదే నా ఆశయం."

-సౌమ్య సదా​, స్వంతంత్ర అభ్యర్థి

పాకిస్థాన్​కు చెందిన సౌమ్య సదా​ కుటుంబంతో పాటు కుప్వారా జిల్లాలో స్థిరపడ్డారు. మౌలానా అజాద్​ విశ్వవిద్యాయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశారు ఆమె.

ఇదీ చూడండి: కశ్మీర్​ ఎన్నికలు: మూడో దశ పోలింగ్​ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.