Pakistani Arrested in Hyderabad : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కోసం ఓ పాకిస్థాన్ దేశస్తుడు(Pakistani National in Hyderabad) సరిహద్దులను దాటొచ్చాడు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు. గుట్టుచప్పుడు కాకుండా భార్యతో కలిసి నివసిస్తున్న అతని వ్యవహారం దాదాపు 9 నెలల తర్వాత బట్టబయలైంది. మరో వ్యక్తి పేరిట ఆధార్ కార్డు సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కాడు. అతనికి సహకరించిన యువతి తల్లిదండ్రులపైనా బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pakistan Man Arrested in Hyderabad : పాకిస్థాన్‌లోని ఖైబర్ పంక్తుఖ్వాకు చెందిన 24 ఏళ్ల ఫయాజ్ అహ్మద్.. 2018 డిసెంబరులో ఉపాధి కోసం షార్జాకు వెళ్లాడు. స్థానికంగా సైఫ్‌జోన్‌లోని వస్త్ర పరిశ్రమలో పనిలో చేరాడు. హైదరాబాద్‌లోని బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిషన్‌బాగ్‌కు చెందిన 29 ఏళ్ల నేహ ఫాతిమా ఉపాధి కోసం 2019లో షార్జా వెళ్లింది. అక్కడి మిలీనియం ఫ్యాషన్ పరిశ్రమలో ఫాతిమా ఉద్యోగం పొందేందుకు ఫయాజ్ సహకరించాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి షార్జాలోనే 2019లో వివాహం చేసుకున్నారు. వారికి ప్రస్తుతం మూడేళ్ల మగబిడ్డ కూడా ఉన్నాడు.
తల్లిదండ్రులను ఎదిరించి హైకోర్టులో పోరాడి మరీ ఒక్కటైన అమ్మాయిలు
Pakistani National Arrested in Hyderabad : ఫాతిమా ఒక్కతే గతేడాది హైదరాబాద్ తిరిగివచ్చి కిషన్‌బాగ్‌లోని అసఫ్ బాబానగర్‌లో ఉంటోంది. ఫయాజ్ పాకిస్థాన్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్ షేక్, అఫ్జల్ బేగం.. ఫయాజ్‌ను సంప్రదించారు. పాకిస్థాన్ నుంచి హైదరాబాద్‌కు రావాలని స్థానికుడి గుర్తింపు పత్రాలు వచ్చేలా చూసుకుంటామని చెప్పారు. వీసా, ఇతరత్రా ఎలాంటి గుర్తింపు లేకున్నా ఫయాజ్ గతేడాది నవంబరులో పాకిస్థాన్ నుంచి నేపాల్ వెళ్లాడు. జుబేర్ షేక్, అఫ్జల్ బేగం ఇద్దరూ నేపాల్‌లోని ఖాట్మండుకు వెళ్లి ఫయాజ్‌ను కలిసి సరిహద్దుల్లో కొందరి సాయంతో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకొచ్చారు. అనంతరం హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో అక్రమంగా ఉండేందుకు ఆవాసం కల్పించారు.
Pakistani Man Illegally Entered India For His Wife : అతనికి ఆధార్ కార్డు ఇప్పించి స్థానికుడిలా నమ్మించేందుకు పథకం వేశారు. మాదాపూర్‌లో ఒక ఆధార్ నమోదు కేంద్రానికి తీసుకెళ్లి తమ కుమారుడు మహ్మద్ గౌస్ పేరిట రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించారు. ఈ సమాచారం స్థానికుల ద్వారా పోలీసులకు చేరింది. అప్రమత్తమైన పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పాకిస్థానీగా తేలింది. అతని దగ్గరున్న పాకిస్థాన్ పాస్‌పోర్టు గడువు కూడా ముగిసినట్లు తేలింది.
జుబేర్ ఖాన్, అఫ్జల్ బేగం ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుణిని అదుపులోకి తీసుకున్న అనంతరం కౌంటర్ ఇంటలిజెన్స్, కేంద్ర నిఘావర్గాలు అతణిని విచారించాయి. ఉద్దేశపూర్వకంగా సరిహద్దులు దాటాడా.. కుట్ర కోణం ఏమైనా ఉందా అని లోతుగా విచారిస్తున్నారు. అతని ఫోన్, స్థానిక పరిచయాలు ఇతర అన్ని సంబంధాలను ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

కేంద్ర నిఘా సంస్థలు ఎంట్రీ : హైదరాబాద్‌లో పట్టుబడిన పాకిస్థానీపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. యువతితో పెళ్లి వెనుక కుట్రకోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. పాకిస్థాన్‌కు చెందిన ఫయాజ్ నేపాల్ మీదుగా హైదరాబాద్ వచ్చేందుకు అత్త, మామ సహకరించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీలో అతనుకు ఉన్న పరిచయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని.. సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. ఫయాజ్ కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఫయాజ్‌ను నిఘా వర్గాలు విచారించనున్నాయి.
"ఫయాజ్ అనే వ్యక్తి పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతని దగ్గరున్న పాకిస్థాన్ పాస్‌పోర్టు, పాకిస్తాన్ గుర్తింపు కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫ్లైట్ టికెట్స్, రైల్వే టికెట్స్, నేపాల్ బోర్డింగ్ పాస్ లాంటివి స్వాధీనం చేసుకున్నాము. జుబేర్ ఖాన్, అఫ్జల్ బేగం ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుణ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటాము". - సాయి చైతన్య, డీసీపీ
ఇన్‌స్టాలో పరిచయం.. ప్రియుడి కోసం భారత్ వచ్చిన పోలాండ్ మహిళ.. ఆరేళ్ల కూతురితో..