ETV Bharat / bharat

ORS​ పితామహుడికి పద్మవిభూషణ్.. ములాయం సింగ్, జాకీర్ హుస్సేన్​ సహా ఆరుగురికి - పద్మ అవార్డులు 2023

padma awards 2023 list
padma awards 2023 list
author img

By

Published : Jan 25, 2023, 9:06 PM IST

Updated : Jan 25, 2023, 10:42 PM IST

21:02 January 25

ORS​ పితామహుడికి పద్మవిభూషణ్.. ములాయం సింగ్, జాకీర్ హుస్సేన్​ సహా ఆరుగురికి

ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఆరుగురిని ఎంపిక చేసింది. అతిసార వ్యాధి చికిత్స కోసం ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ(ఓఆర్ఎస్)ని ప్రాచుర్యంలోకి తెచ్చిన పిల్లల వైద్యుడు దిలీప్ మహాలనెబిస్​; సోషలిస్టు నేత, సమాజ్​వాదీ వ్యవస్థాపకులు దివంగత ములాయం సింగ్ యాదవ్​, ప్రముఖ సంగీత నిపుణుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్​లకు పద్మవిభూషణ్ ప్రకటించింది. మరో 9 మందికి పద్మ భూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉన్నారు. ఏడుగురికి మరణాంతరం పద్మ అవార్డులు లభించాయి. మొత్తం 106 అవార్డులను కేంద్రం ప్రకటించగా.. 109 మంది వీటిని అందుకోనున్నారు. మూడు పద్మశ్రీ అవార్డులను ఇద్దరేసి చొప్పున స్వీకరించనున్నారు. అయితే, దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతతరత్న అవార్డుకు మాత్రం ఎవరినీ ఎంపిక చేయలేదు కేంద్రం.

బిర్లా, సుధామూర్తికి పద్మభూషణ్..
ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా; నవలా రచయిత ఎస్ఎస్ భైరప్ప; వితరణశీలి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తిలను పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రం.
కొద్దినెలల క్రితం ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్​ఝున్​వాలాను పద్మశ్రీ వరించింది. నటి రవీనా టాండన్, సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, మణిపుర్ భాజపా అధ్యక్షుడు థౌనావ్​జామ్ చావ్​బా సింగ్​కు పద్మశ్రీ ప్రకటించింది కేంద్రం.

ఓఆర్ఎస్ పితామహుడు
దిలీప్ మహాలనెబిస్ వైద్య రంగంలో చేసిన సేవలకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. 20వ శతాబ్దంలో అతి ముఖ్యమైన వైద్య ఆవిష్కరణగా ఓఆర్ఎస్​ను అభివర్ణించింది కేంద్రం. దీన్ని దిలీప్ విస్తృతంగా ఉపయోగంలోకి తెచ్చారని గుర్తు చేసింది. ఓఆర్ఎస్ వాడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల మంది ప్రాణాలను కాపాడినట్లైందని తెలిపింది. "దేశసేవ కోసం అమెరికా నుంచి వచ్చిన దిలీప్.. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సందర్భంగా శరణార్థుల శిబిరాల్లో పనిచేశారు. ఇక్కడ ఉంటూ.. ఓఆర్ఎస్ ప్రభావవంతంగా పనిచేస్తోందని దిలీప్ నిర్ధరణకు వచ్చారు. ఓఆర్ఎస్​ అనేది చాలా సులభమైన, చౌకగా లభించే అత్యంత ప్రభావవంతమైన ఔషధం. డయేరియా, కలరా వ్యాధి వల్ల సంభవించే మరణాల్లో 93 శాతం ఈ ఓఆర్ఎస్ వల్ల తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా శిశువులు, చిన్నారుల్లో మరణాలు తగ్గిపోయాయి" అని కేంద్రం తెలిపింది.

మరోవైపు, కేరళకు చెందిన గాంధేయవాది వీపీ అప్పుకుట్టం పొదువాల్, నాగాలాండ్ సామాజిక కార్యకర్త రామ్​కుయివాంగ్​బే నెవ్మే, నాగాలాండ్ సంగీత నిపుణుడు మోవా సబోంగ్​లకు పద్మ అవార్డులు లభించాయి. బంగాల్ రాష్ట్రానికి చెందిన 102 ఏళ్ల సరింద వాయిద్యకారుడు మంగలకాంతి రాయ్, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న 98 ఏళ్ల వృద్ధుడు తులా రామా ఉప్రేటిని పద్మశ్రీ వరించింది. పెద్దగా వెలుగులోకి రాని, చరిత్రలో స్థానం లభించని హీరోలకు పద్మ అవార్డులు ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. రతన్ చంద్ర కార్, హీరాబాయ్ లోబీ, మనీశ్వర్ చందర్ దావర్ వంటి ప్రముఖులను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

అవార్డుకు ఎంపికైన వారి పేర్లు

  • పద్మవిభూషణ్
    • బాలకృష్ణ దోశి (మరణానంతరం)
    • జాకీర్ హుస్సేన్
    • ఎస్.ఎం. కృష్ణ
    • దిలీప్ మహాలనెబిస్ (మరణానంతరం)
    • శ్రీనివాస్ వరదన్
    • ములాయం సింగ్ యాదవ్ (మరణానంతరం)
  • పద్మ భూషణ్
    • ఎస్.ఎల్. భైరప్ప
    • కుమార మంగళం బిర్లా
    • దీపక్ ధార్
    • వాణి జైరామ్
    • చిన్న జీయర్ స్వామి
    • సుమన్ కల్యాణ్​పుర్
    • కపిల్ కపూర్
    • సుధా మూర్తి
    • కమలేశ్ డి పటేల్
  • పద్మశ్రీ
    • డా. సుకమ ఆచార్య
    • జోధయ్యబాయి బైగా
    • ప్రేమ్‌జిత్ బారియా
    • ఉషా బార్లే
    • మునీశ్వర్ చందావార్
    • హేమంత్ చౌహాన్
    • భానుభాయ్ చితారా
    • హెమోప్రోవా చుటియా
    • నరేంద్ర చంద్ర దెబ్బర్మ (మరణానంతరం)
    • సుభద్రా దేవి
    • ఖాదర్ వల్లీ దూదేకుల
    • హేమ్ చంద్ర గోస్వామి
    • ప్రితికనా గోస్వామి
    • రాధా చరణ్ గుప్తా
    • మోడడుగు విజయ్ గుప్త
    • అహ్మద్ హుస్సేన్, శ్రీ మహ్మద్ హుస్సేన్ (ఇద్దరికి కలిపి)
    • దిల్షాద్ హుస్సేన్
    • భికు రామ్‌జీ ఇడాటే
    • సీ.ఐ ఇస్సాక్
    • రత్తన్ సింగ్ జగ్గీ
    • బిక్రమ్ బహదూర్ జమాటియా
    • రామ్​కుయివాంగ్బె జెనే
    • రాకేశ్ రాధేశ్యామ్ ఝున్‌ఝున్‌వాలా (మరణానంతరం)
    • రతన్ చంద్ర కార్
    • మహిపత్ కవి
    • ఎం.ఎం. కీరవాణి
    • అరీజ్ ఖంబట్టా (మరణానంతరం)
    • పరశురామ్ కోమాజీ ఖునే
    • గణేష్ నాగప్ప కృష్ణరాజనగర
    • మాగుని చరణ్ కుమార్
    • ఆనంద్ కుమార్
    • అరవింద్ కుమార్
    • దోమర్ సింగ్ కున్వర్
    • రైజింగ్బోర్ కుర్కలాంగ్
    • హీరాబాయి లోబీ
    • మూల్‌చంద్ లోధా
    • రాణి మాచయ్య
    • అజయ్ కుమార్ మాండవి
    • ప్రభాకర్ భానుదాస్ మందే
    • గజానన్ జగన్నాథ మనే
    • అంతర్యామి మిశ్రా
    • నాడోజ పిండిపాపనహళ్లి మునివెంకటప్ప
    • ప్రొఫెసర్ (డా.) మహేంద్ర పాల్
    • ఉమా శంకర్ పాండే
    • రమేష్ పర్మార్, శ్రీమతి శాంతి పర్మార్ *(ఇద్దరికి కలిపి)
    • డా. నళిని పార్థసారథి
    • హనుమంత రావు పసుపులేటి
    • రమేశ్ పతంగే
    • కృష్ణ పటేల్
    • కె. కల్యాణసుందరం పిళ్లై
    • వి.పి. అప్పుకుట్టన్ పొదువల్
    • కపిల్ దేవ్ ప్రసాద్
    • ఎస్.ఆర్.డి. ప్రసాద్
    • షా రషీద్ అహ్మద్ ఖాద్రీ
    • సి.వి. రాజు
    • బక్షి రామ్
    • చెరువాయల్ కె. రామన్
    • సుజాత రాందొరై
    • అబ్బారెడ్డి నాగేశ్వరరావు
    • పరేశ్​భాయ్ రత్వా
    • బి. రామకృష్ణా రెడ్డి
    • మంగళ కాంతి రాయ్
    • కె.సి. రన్​రెంసంగి
    • వడివేల్ గోపాల్, శ్రీ మాసి సదయ్యన్ *(ఇద్దరికి కలిపి)
    • మనోరంజన్ సాహు
    • పతయత్ సాహు
    • రిత్విక్ సన్యాల్
    • కోట సచ్చిదానంద శాస్త్రి
    • సంకురాత్రి చంద్రశేఖర్
    • కె. షానతోయిబా శర్మ
    • నెక్రమ్ శర్మ
    • గురుచరణ్ సింగ్
    • లక్ష్మణ్ సింగ్
    • మోహన్ సింగ్
    • తౌనోజం చావోబా సింగ్
    • ప్రకాశ్ చంద్ర సూద్
    • నెయిహునౌ సోర్హీ
    • డా. జనుమ్ సింగ్ సోయ్
    • కుశోక్ థిక్సే నవాంగ్ చంబా స్టాంజిన్
    • ఎస్. సుబ్బరామన్
    • మోవా సుబాంగ్
    • పాలం కల్యాణ సుందరం
    • రవీనా రవి టాండన్
    • విశ్వనాథ్ ప్రసాద్ తివారి
    • ధనిరామ్ టోటో
    • తులా రామ్ ఉపేతి
    • డాక్టర్ గోపాల్సామి వేలుచామి
    • డాక్టర్ ఈశ్వర్ చందర్ వర్మ
    • కూమి నారిమన్ వాడియా
    • కర్మ వాంగ్చు (మరణానంతరం)
    • గులాం ముహమ్మద్ జాజ్

Last Updated : Jan 25, 2023, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.