ETV Bharat / bharat

అక్షరాస్యతలో కేరళ మరో అరుదైన ఘనత

అక్షరాస్యతలో దేశంలోనే తొలి స్థానంలో ఉండే కేరళ రాష్ట్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కేవలం నాలుగేళ్లలోనే లక్షమందికిపైగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దింది. గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల కాలంలో కేవలం 4,600 మంది అక్షరాస్యత సాధించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య లక్ష మార్క్​ను దాటడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Over one lakh people achieve literacy in Kerala in four years
అక్షరాస్యతలో కేరళ మరో అరుదైన ఘనత
author img

By

Published : Feb 19, 2021, 3:53 PM IST

అక్షరాస్యతలో మలయాళీ రాష్ట్రం అరుదైన ఘనత సాధించింది. కేవలం నాలుగేళ్లలో సుమారు లక్ష మందికిపైగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దింది కేరళ. ఈ చారిత్రక విజయంలో మొత్తం 1,08,057 మంది ఉండగా.. వీరిలో ఎక్కువ మంది అట్టడుగు స్థాయి వర్గాల వారే కావడం విశేషం. 2016-20 మధ్యకాలంలో ఈ ఘనత సాధించగా.. దక్షిణాది రాష్ట్రాలలో గత 30ఏళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం.

అక్షరాస్యత పొందినవారిలో పెద్దసంఖ్యలో మత్స్యకారులు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థిరపడిన కార్మికుల కుటుంబీకులే ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో కేరళ స్టేట్​ లిటరసీ మిషన్​ అథారిటీ (కేఎస్​ఎల్​ఎంఏ) అమలు చేసిన వివిధ కార్యక్రమాల ద్వారా ఈ అరుదైన ఘనత సాధించినట్టు పేర్కొన్నారు.

కేఎస్​ఎల్ఎంఏ ద్వారా మహిళలతో సహా.. మొత్తం 1,35,608 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్టు గణాంకాలు వివరిస్తున్నాయి. అయితే.. గత యూడీఎఫ్​ పదవీ కాలంలో(2011-15) పలు కార్యక్రమాల ద్వారా కేవలం 4,600 మంది అక్షరాస్యత సాధించినందున ప్రస్తుత గణాంకాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదీ చదవండి: జల విలయం- 62కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.