కర్ణాటకలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న క్రమంలో బెంగళూరులో 8వేల మందికి పైగా వైరస్ బాధితుల జాడ తెలియకపోవటం కలకలం రేపుతోంది. మూడు నెలల్లో 8,483 మంది కొవిడ్ బాధితులు మిస్సింగ్‌లో ఉన్నట్లు బెంగళూరు మహానగర పాలక సంస్థ, వైద్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫోన్లు స్విచ్ ఆఫ్..
వైరస్ ఉందని తేలిన వెంటనే కొందరు.. తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. మరికొంత మంది పరీక్షల సమయంలో నకిలీ ఫోన్ నంబర్లు, చిరునామాలు ఇచ్చారన్నారు. స్థానిక పోలీస్ అధికారుల సహాయంతో బాధితులను గుర్తిస్తున్నామని చెప్పారు.
మార్చిలో 3,066 మంది బాధితులు మిస్సింగ్ కాగా.. వారిలో 2,780 మందిని గుర్తించారు. ఏప్రిల్‌లో 46,126 మంది వైరస్ బాధితుల జాడ తెలియక పోగా.. వారిలో 42,147 మందిని గుర్తించారు. మేలో మిస్ అయిన 20,330 మంది బాధితుల్లో 16,112 మందిని గుర్తించారు.
ఇదీ చదవండి : 'టీకా పంపిణీకి వికేంద్రీకృత విధానం అవసరం'