ETV Bharat / bharat

'ఇప్పటికే 50శాతం మంది చిన్నారులపై కరోనా ప్రభావం' - కరోనా మూడో దశ

కరోనా మూడో దశ ప్రభావం చిన్నారులపైనే ఎక్కువ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ముంబయిలో నిర్వహించిన సెరో సర్వేలో ఊరటనిచ్చే ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే 50 శాతం మంది చిన్నారులకు కరోనా యాంటిబాడీస్‌ ఉన్నాయని ఆ సర్వే వెల్లడించింది. గతంతో పోలిస్తే యాంటీబాడీస్ పెరిగిన చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని సెరో సర్వే తేల్చి చెప్పింది.

paediatric sero survey
పిల్లల్లో యాంటీబాడీలు
author img

By

Published : Jun 28, 2021, 9:03 PM IST

Updated : Jun 29, 2021, 11:44 AM IST

కరోనా మూడో దశతో పిల్లలకే ఎక్కువ ప్రమాదమన్న ఊహగానాల నేపథ్యంలో బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్ బీఎంసీ నిర్వహించిన సెరో సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు 10 వేల మంది చిన్నారులపై నిర్వహించిన ఈ సర్వేలో 50 శాతానికిపైగా పిల్లల్లో కొవిడ్ యాంటీబాడీస్ ఉన్నాయని తేలింది. ముంబయిలోని 24 వార్డుల్లో మే, జూన్ నెలల్లో 6 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ఈ సెరో సర్వే నిర్వహించామని బీఎంసీ వివరించింది. బీవైఎల్​ నాయర్ ఆస్పత్రి, కస్తూర్బా మాలిక్యులర్ డయాగ్నస్టిక్ ప్రయోగశాల నిర్వహించిన ఈ సెరో సర్వేలో... ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని బీఎంసీ అధికారులు వెల్లడించారు. కొన్ని వారాల్లో కరోనా మూడో దశ వస్తుందన్న వార్తల నేపథ్యంలో సెరో సర్వే ఫలితాలు మూడో దశ ప్రభావం చిన్నారులపై అంతగా ఉండదని తెలుపుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.

ముంబయి పిల్లల జనాభాలో 50 శాతానికి పైగా కరోనా యాంటీబాడీస్‌ ఉన్నట్లు తెలిపిన సర్వే.. మునుపటి సర్వేతో పోలిస్తే యాంటీబాడీస్ కలిగిన చిన్నారుల నిష్పత్తి పెరిగిందని వెల్లడించింది. ఈ అధ్యయనంతో ముంబయిలోని చిన్నారుల్లో 50 శాతానికి పైగా ఇప్పటికే కరోనా బారినపడ్డారని వెల్లడవుతోందని వైద్యులు తెలిపారు. మొత్తంగా 51.18 శాతం మంది చిన్నారులకు కొవిడ్‌ యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వేలో తేలింది. 1 నుంచి నాలుగేళ్ల మధ్య ఉన్నచిన్నారుల్లో కరోనా యాంటీబాడీస్ 51.04 శాతం ఉండగా... 5 నుంచి 9 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల్లో 47.33 శాతం యాంటీబాడీస్‌ ఉన్నట్లు బీఎంసీ సేరో సర్వే గుర్తించింది. 10 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారుల్లో అత్యధికంగా 53.43 శాతం యాంటీబాడీస్‌ ఉండగా.. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారిలో 51.39 శాతం కరోనా ప్రతిరోధకాలు ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది.....

మార్చిలో నిర్వహించిన సేరో సర్వేతో పోలిస్తే ఈ సారి పిల్లల్లో కరోనా యాంటీబాడీస్‌ పెరిగాయని బీఎంసీ తెలిపింది. అప్పుడు నిర్వహించిన సర్వేలో 18 ఏళ్ల లోపు వారిలో 39.4 శాతం యాంటీబాడీస్ ఉండగా.. ఇప్పుడు అది 51.18 శాతానికి పెరిగింది.

ఇదీ చదవండి:దేశంలో మరో 46,148 మందికి కరోనా

వ్యాక్సినేషన్​లో అమెరికాను దాటిన భారత్

Last Updated : Jun 29, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.