ETV Bharat / bharat

ఆన్​లైన్​ గేమ్స్​కు బానిస.. రోడ్డుపై వెళ్లే వాహనాలను ఆపుతూ...

Online games addiction: ఆన్​లైన్​ గేమ్స్​కు బానిసైన ఓ యువకుడు.. మతిస్థిమితం కోల్పోయాడు. రోడ్డుపై వెళ్లే వాహనాలను అడ్డుకుని పాస్​వర్డ్​ మార్చుకో, హ్యాకర్లు ఉన్నారంటూ చెబుతున్న ఈ సంఘటన రాజస్థాన్​లోని చిత్తోడ్​గఢ్​లో జరిగింది. అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Online games addiction
ఆన్​లైన్​ గేమ్స్​కు బానిస
author img

By

Published : Mar 27, 2022, 10:39 AM IST

Updated : Mar 27, 2022, 12:17 PM IST

ఆన్​లైన్​ గేమ్స్​కు బానిసగా మారిన యువకుడు

Online games addiction: ప్రస్తుత రోజుల్లో మొబైల్​ ఫోన్​ ప్రతిఒక్కరి చేతిలో కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మొబైల్​ వాడుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా వాటిని వినియోగిస్తున్నారు. సోషల్​ మీడియా, ఆన్​లైన్​ గేమ్స్​ అంటూ.. అర్ధరాత్రి దాటినా మెలకువగా ఉంటూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. ఇటీవల ఆన్​లైన్​ గేమ్స్​కు బానిసై వింతగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చాలానే వెలుగు చూశాయి. అలాంటి ఘటనే రాజస్థాన్​లోని చిత్తోడ్​గఢ్​లో జరిగింది.

బాన్​సెన్​ గ్రామానికి చెందిన ఇర్ఫాన్​ అన్సారీ అనే యువకుడు ఆన్​లైన్​ గేమ్స్​కు బానిసై మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నాడు. రోడ్లపై వెళ్తూ హ్యాకర్​, హ్యాకర్​.. పాస్​వర్డ్​ మార్చుకోండి అంటూ పిచ్చిగా ఆరుస్తున్నాడు. అన్సారీ గతంలో బిహార్​లోని చప్​రా ప్రాంతంలో నివసించేవాడు. కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్​లోని బాన్​సెన్​కు వచ్చాడు. గంటల కొద్దీ మొబైల్​ ఫోన్​ పట్టుకునే ఉంటాడని, ఫైరింగ్​ గేమ్స్​ ఎక్కువగా ఆడుతున్నట్లు గుర్తించామని కుటుంబ సభ్యులు తెలిపారు.

గత గురువారం రాత్రి గేమ్స్​ ఆడుతుండగా ఆకస్మత్తుగా ఫోన్​ స్విచ్​ ఆఫ్​ అయింది. ఆ తర్వాత మతిస్థితిమితం కోల్పోయిన వాడిలా ప్రవర్తించటం ప్రారంభించాడు. శుక్రవారం పొద్దున ఉదయ్​పుర్​ రహదారిపైకి చేరి వాహనాలను ఆపుతూ పాస్​వర్డ్స్​ మార్చుకోవాలని ఆరవటం చేశాడు. గమనించిన స్థానికులు పట్టుకుని మంచానికి కట్టేశారు. కుటుంబ సభ్యులకు అప్పగించగా.. జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మానసిక వైద్య నిపుణుడి పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండి గేమ్స్​ ఆడితే ఇలాంటి పరిస్థితికి దారితీస్తుందని చెప్పారు.

Last Updated : Mar 27, 2022, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.