జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా దళాలు.
జిల్లాలోని జైపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు.. నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ముష్కరులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. దీటుగా ఎదుర్కొన్న భారత సైన్యం.. ఎదురుదాడికి చేసింది. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.