ETV Bharat / bharat

రూపాయికే లీటర్ పెట్రోల్.. బారులుతీరిన జనం - one rupee per litre petrol news

మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే జన్మదినం( జూన్ 13) సందర్భంగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది డోంబివలీ యువసేన. ఠాణేలోని ఉస్మా పెట్రోల్ బంక్​లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

అక్కడ రూపాయికే లీటర్ పెట్రోల్.. భారీగా క్యూ
one rupee per litre petrol in mumbai
author img

By

Published : Jun 13, 2021, 8:26 PM IST

రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమం ప్రారంభిస్తున్న మంత్రి

ఓ వైపు దేశవ్యాప్తంగా పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్​ పెట్రోల్​ 100కు చేరువైంది. ఈ తరుణంలో రూపాయికే లీటర్​ పెట్రోల్​ ఇస్తే.. ఆశ్చర్యమే కదా!. ముంబయి ఠాణేకు చెందిన డోంబివలీ యువసేన.. రూపాయికే లీటర్​ పెట్రోల్​ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే జన్మదినం( జూన్ 13) సందర్భంగా ఠాణేలోని ఉస్మా పెట్రోల్ బంక్​లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

రూపాయికే లీటరు పెట్రోల్ ఇస్తున్నారన్న వార్త అందగానే.. పెట్రోల్​ బంక్​కు పరుగులుతీశారు వాహనదారులు. బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి.

one rupee per litre petrol
పెట్రోల్ బంక్ వద్ద రద్దీ
one rupee per litre petrol
భారీగా క్యూ కట్టిన ప్రజలు

అక్కడ రూ. 50కే పెట్రోల్​..

మరోవైపు మహారాష్ట్ర అంబర్​నాథ్​ వింకో నకాలోని ఓ పెట్రోల్ బంక్​లో లీటర్​ పెట్రోల్ రూ. 50 కే అందించారు. ఉదయం 11 నుంచి ఒంటిగంట మధ్య వచ్చిన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు.

ఇదీ చదవండి : Live Video: క్షణాల్లోనే కారు మాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.