ETV Bharat / bharat

యువకుడి కోసం వృద్ధురాలు పడక త్యాగం - యువకుడి కోసం బెడ్​ త్యాగం చేసిన వృద్ధురాలు

దేశంలో కరోనా విజృంభణతో ఆస్పత్రులలో పడకలకు తీవ్ర కొరత ఏర్పడింది. కరోనా సోకిన ఓ యువకుడు ఆస్పత్రిలో బెడ్​ కోసం వేచి చూస్తుండగా.. తన పడకను త్యాగం చేసి మానవత్వాన్ని చాటుకుంది ఓ వృద్ధురాలు. రాజస్థాన్​లోని పాలీలో ఈ ఘటన జరిగింది.

OLD WOMAN GOT HER HOSPITAL BED ALLOTTED TO YOUNG MAN
వృద్ధురాలు, యువకుడు, పడక
author img

By

Published : May 8, 2021, 2:55 PM IST

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో.. కరోనా బారిన పడిన వారికి ఆసుపత్రుల్లో పడక దొరకడం తీవ్ర కష్టతరంగా మారింది. రాజస్థాన్​లోని ఓ వృద్ధురాలు.. తాను చికిత్స పొందుతున్న బెడ్​ను ఓ యువకుడికి త్యాగం చేసింది.

పాలీ జిల్లా రోహత్​ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు.. శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడుతూ ఆస్పత్రిలో చేరింది. అయితే.. గంటల తరబడి నిరీక్షించాక ఎట్టకేలకు ఓ పడక లభించాక.. ఆమెకు ఆక్సిజన్​ అందించారు వైద్యులు. ఆ తర్వాత.. అదే సమస్యతో ఓ యువకుడు ఆస్పత్రికి వచ్చాడు. తన కుమారుణ్ని చేర్చుకుని చికిత్స అందించాలని ఆ యువకుడి తండ్రి వైద్యులను వేడుకుంటున్న దృశ్యాలను ఆమె చూసింది. ఈ ఘటనతో చలించిపోయిన బామ్మ.. వెంటనే తన బెడ్​ను ఆ యువకుడికి ఇచ్చి ఔదార్యాన్ని చాటుకుంది.

ఇదీ చదవండి: కన్నవారిని కడతేర్చిన 14ఏళ్ల కొడుకు ​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.