ETV Bharat / bharat

విధులకు వెళ్తూ.. ముగ్గురు పోలింగ్​ సిబ్బంది దుర్మరణం - బస్సు ప్రమాదం

Odisha Bus Accident: బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు పోలింగ్​ సిబ్బంది దుర్మరణం చెందారు. మరో 25 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

Odisha Bus Accident
Odisha Bus Accident
author img

By

Published : Feb 19, 2022, 4:55 PM IST

Odisha Bus Accident: ఒడిశా నబరంగ్​పుర్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ముగ్గురు పోలింగ్​ సిబ్బంది(విలేజ్​ గార్డులు) మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మోకియా సమీపంలోని సోరిస్‌పదర్ గ్రామంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది గార్డులు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈ నెల 20న మూడోదశ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. దీనిలో భాగంగా గార్డులను కాసరగుమడ బ్లాక్​కు తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: డ్రైవింగ్​ మాత్రమే కాదు 'ఓటు' వేయడం కూడా డ్యూటీనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.