జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ పేరు మీదుగా ట్విట్టర్లో(Nsa Ajit Doval Twitter) నకిలీ ఖాతాలు కనిపిస్తున్నాయి. అందులో నుంచి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు కొందరు దుండగులు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. అజిత్ డోభాల్కు ట్విట్టర్లో(Nsa Ajit Doval Twitter) అధికారిక ఖాతా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ(Arindam Bagchi) ట్విట్టర్ వేదికగా తెలిపారు.
"ముఖ్యమైన గమనిక. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్కు ట్విట్టర్లో అధికారిక ఖాతా లేదు. ఆయన పేరు మీదుగా ఉన్న నకిలీ ఖాతాలు, మోసపూరితమైన సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు ఇదో సూచన.
-అరిందమ్ బాగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి
అజిత్ డోభాల్ పేరు మీదుగానే కాకుండా.. వివిధ ప్రముఖుల పేర్లతోనూ ట్విట్టర్లో నకిలీ ఖాతాలు(Twitter Fake Account) దర్శనమిస్తున్నాయి. ఆ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారాన్ని దుండగులు వ్యాప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: రఫేల్పై మళ్లీ దుమారం- లంచాలపై కీలక ఆధారాలు బహిర్గతం!
ఇదీ చూడండి: ఆ రోజు నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు