ETV Bharat / bharat

గుప్కర్​లో కాంగ్రెస్​ భాగం కాదు: సుర్జేవాలా

కశ్మీర్​ స్థానిక పార్టీల కూటమి.. గుప్కర్​ అలియన్స్​లో కాంగ్రెస్​ చేరిందంటూ భాజపా చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు ఆ​ పార్టీ ముఖ్య ప్రతినిధి సుర్జేవాలా. గుప్కర్​లో కాంగ్రెస్​ భాగం కాదన్న సుర్జేవాలా.. హోం మంత్రి, భాజపా మంత్రులు కావాలనే తమ పార్టీపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

Not part of Gupkar alliance, clarifies Congress
గుప్కర్​లో కాంగ్రెస్​ భాగం కాదు. కానీ..: సుర్జేవాలా
author img

By

Published : Nov 18, 2020, 5:31 AM IST

కశ్మీర్​ గుప్కర్​ అలియన్స్​(పీపుల్స్​ అసోయేషన్​ ఫర్​ గుప్కర్​ డిక్లరేషన్​-పీఏజీడీ)లో కాంగ్రెస్ చేరడంపై వస్తున్న కథనాలపై ఆ పార్టీ స్పష్టతనిచ్చింది. గుప్కర్​ కూటమిలో కాంగ్రెస్​ భాగం కాదని.. కేవలం ప్రజాస్వామ్య బద్ధంగా భాజపా 'ప్రజావ్యతిరేక చర్యల'ను బయటపెట్టేందుకే కశ్మీర్​ జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు ఆ పార్టీ ముఖ్య ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

జమ్ముకశ్మీర్​ సహా దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తేల్చిచెప్పారు సుర్జేవాలా.

కేంద్రమంత్రి అమిత్​ షాతో పాటు ప్రభుత్వంలోని పలువురు మంత్రులు.. జమ్ముకశ్మీర్​పై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారాలు సాగిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్​ ప్రతినిధి. దేశ విద్రోహ భావాలున్న ఎన్​సీ, పీడీపీతో కాంగ్రెస్​ జతకట్టిందని అమిత్​ షా ఆరోపించిన నేపథ్యంలో సుర్జేవాలా ఈ వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్​లో అనేక పార్టీలను కలిగి ఉన్న పీఏజీడీ.. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది.

ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో భాగమే: అమిత్​ షా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.