ETV Bharat / bharat

'ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి సెలవులు!'.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం - smriti irani on she box complaint

మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనేదీ కేంద్రం పరిశీలనలో లేదని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. మరోవైపు పని ప్రదేశాల్లో మహిళపై లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం పెట్టిన పోర్టల్​లో 2017 నుంచి ఇప్పటివరకు 1349 ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం వెల్లడించింది.

smriti irani on menstrual leave
smriti irani on menstrual leave
author img

By

Published : Jul 29, 2022, 6:19 PM IST

కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మాతృత్వ, మెడికల్​ ఇలా అనేక రకాల సెలవులు మహిళా ఉద్యోగులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 10-19 వయసు మధ్యగల పిల్లలలో పరిశుభ్రమైన నెలసరిని ప్రోత్సహించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనేక పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. నాణ్యత గల సానిటరీ న్యాప్​కిన్స్​ వినియోగం, పర్యావరణ హితంగా తయారీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం భారతీయ జనఔషధి ప్రయోజన పథకం కింద తక్కవ ధరకే నాణ్యమైన న్యాప్​కిన్స్​ అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

లైంగిక వేధింపులపై 1349 ఫిర్యాదులు: మరోవైపు పని ప్రదేశాల్లో మహిళపై లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం పెట్టిన పోర్టల్​లో 2017 నుంచి ఇప్పటివరకు 1349 ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పని ప్రదేశాల్లో మహిళపై లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం సెక్సువల్​ హరాస్​మెంట్​ ఎలక్ట్రానిక్​ బాక్స్​(షీ బాక్స్​) పేరిట 2017లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పోర్టల్​లో ఫిర్యాదు చేస్తే సంబంధిత శాఖకు చేరి సరైన చర్యలు తీసుకుంటుంది.

ఇవీ చదవండి:

'24 గంటల్లో ఆ ట్వీట్లు తొలగించండి.. లేదంటే'.. కాంగ్రెస్​ నేతలకు హైకోర్టు వార్నింగ్​

700 అడుగుల లోతు బోరుబావిలో బాలిక.. రక్షించిన ఆర్మీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.