ETV Bharat / bharat

'భాజపా కోరిక మేరకే నితీశ్ సీఎంగా ఉన్నారు' - Nitish was reluctant to continue as CM, BJP had to convince him

బిహార్​ ఎన్నికల తర్వాత సీఎంగా ఉండటానికి నితీశ్​ కూమార్​ ఆసక్తి చూపలేదని భాజపా సీనియర్ నేత సుశీల్​ మోదీ తెలిపారు. ​ఇటీవల జరిగిన జేడీ(యూ) సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పదే పదే సీఎం పదవి గురించి ప్రస్తావించటాన్ని ఆయన తప్పుపట్టారు.

Nitish was reluctant to continue as CM, BJP had to convince him: Sushil Modi
'భాజపా కోరితేనే నితీశ్ సీఎంగా ఉన్నారు'
author img

By

Published : Dec 28, 2020, 9:02 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం పదవి చేపట్టానికి నితీశ్​ కుమార్​ సమ్మతించలేదని.. భాజపా సీనియర్​ నేత సుశీల్​ కుమార్​ మోదీ తెలిపారు. ఎన్డీఏ తన​ పేరు మీద ఓట్లు అడిగిందని గుర్తు చేసిన తర్వాతనే ముఖ్యమంత్రిగా ఉండటానికి ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పదే పదే నితీశ్​.. సీఎం పదవి గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నితీశ్​కు ఆ పదవిపై పెద్దగా ఆసక్తి లేదని, భాజపా కోరితేనే ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకరించారని సుశీల్​ మోదీ నొక్కి చెప్పారు.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 74, జేడీ(యూ) 43 స్థానాల్లో గెలుపొందాయి. సీట్లు ఎక్కువ రావడం వల్ల కమలం పార్టీ అభ్యర్థినే సీఎం చేయాలని నితీశ్​ చెప్పారు. రాష్ట్ర భాజపా, హెచ్​ఏఎం, వీఐపీ పార్టీలన్ని కోరితేనే నితీశ్​ ముఖ్యమంత్రిగా ఉండటానికి ఒప్పుకున్నారు.

- సుశీల్​ కుమార్​ మోదీ, భాజపా సీనియర్​ నేత.

'అరుణాచల్​ ప్రదేశ్​లో జేడీయూ నేతలు ఫిరాయింపులకు పాల్పడటం వల్ల బిహార్​లో ఇరు పార్టీల సంబంధాలకేమీ నష్టం వాటిల్లదు. రాష్ట్రంలో మరో ఐదేళ్లు పాలన సజావుగా సాగుతుందనే నమ్మకం ఉంది. రెండు పార్టీల మధ్య అద్భుతమైన సమన్వయం ఉంది' అని సుశీల్​ తెలిపారు.

ఇదీ చదవండి: 'కిసాన్ రైలు​తో రైతు సాధికారత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.