ETV Bharat / bharat

చిరాగ్ ఏకాకి- దెబ్బకుదెబ్బ తీసిన నితీశ్! - చిరాగ్ పాసవాన్ ఎల్​జేపీ

లోక్​ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ ఏకాకిగా మారారు. పార్టీ ఎంపీలందరూ తనకు వ్యతిరేకంగా జట్టుకట్టారు. అయితే ఈ పరిణామాలన్నింటికీ జేడీయూ అధినేత నితీశ్ కుమారే కారణమని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను దెబ్బతీసిన ఎల్​జేపీని నిర్వీర్యం చేయడానికి ఆయన పక్కా స్కెచ్​తోనే ఇదంతా చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.

nitish kumar chirag paswan
చిరాగ్ ఏకాకి- దెబ్బకుదెబ్బ తీసిన నితీశ్!
author img

By

Published : Jun 15, 2021, 8:04 AM IST

Updated : Jun 15, 2021, 8:43 AM IST

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా ఉత్తర భారతంలో జరిగే పరిణామాలను అస్సలు ఊహించలేం. రోజుల వ్యవధిలో పరిస్థితులు మారిపోతుంటాయి. అందుకు తాజా, ప్రత్యక్ష ఉదాహరణ.. లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ). ఈ పార్టీలో పరిస్థితులు ఎంతలా మారిపోయాయంటే.. ఏకంగా ఎల్​జేపీ(LJP) అధ్యక్షుడే ఏకాకిగా మారిపోయారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఎల్​జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్​(Chirag Paswan)ను దూరం పెట్టేశారు.

లోక్​సభలో ఎల్​జేపీకి ఆరుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అందులో ఐదుగురు ఎంపీలు.. చిరాగ్ పాసవాన్ స్థానంలో ఆయన బాబాయ్, ఎంపీ పశుపతి కుమార్​ పరాస్(Pasupati Kumar Paras)​ను తమ సభాపక్ష నేతగా ఎంచుకున్నారు. తమ నిర్ణయాన్ని గుర్తించాలని లోక్​సభ స్పీకర్​కు అభ్యర్థన పెట్టుకున్నారు. ఈ పరిణామాలు బిహార్ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారాయి.

బాబాయ్ అయినా..

ఎల్​జేపీ వ్యవస్థాపకులు రాంవిలాస్ పాసవాన్ మరణించి సంవత్సరం కూడా కాక ముందే పార్టీలో ఈ పొరపొచ్చాలు రావడం గమనార్హం. చిరాగ్​కు బాబాయ్ వరుసైన పశుపతి కుమార్ పరాస్​.. ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. చిరాగ్​ను ఏకాకి చేసి మిగిలిన ఎంపీలందరినీ ఆయనకు వ్యతిరేకంగా జట్టుకట్టేలా చేశారు. చిరాగ్​ సోదరుడు, ఎంపీ ప్రిన్స్​ రాజ్​ సైతం పశుపతి శిబిరంలోనే ఉండటం గమనార్హం.

​ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి చిరాగ్ నేరుగా.. పశుపతి కుమార్​ పరాస్​ ఇంటికి వెళ్లినా ఫలితం దక్కలేదు.

మాస్టర్​మైండ్ నితీశ్!

అయితే, ఈ పరిణామాలన్నింటి వెనక.. బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఉన్నారని ఊహాగానాలు విపిస్తున్నాయి. వేరుకుంపటి పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూను ఎల్​జేపీ దెబ్బతీసినందుకు నితీశ్ ప్రతికారం తీర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో జేడీయూ కన్నా భాజపాకు అధిక సీట్లు దక్కాయి కూడా! ఇప్పటికే.. ఎల్​జేపీ టికెట్​పై గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను గతంలోనే జేడీయూలోకి చేర్చుకున్నారు నితీశ్. అసెంబ్లీలో ఎల్​జేపీకి ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఇప్పుడు లోక్​సభ సభ్యులపై ఆయన దృష్టిసారించారని విశ్లేషకులు చెబుతున్నారు.

సన్నిహితులను పురమాయించి..!

నితీశ్​కు అత్యంత సన్నిహితుడైన లలన్ సింగ్.. ఎల్​జేపీ రెబెల్ ఎంపీల్లో ఒకరైన వీణా దేవీ నివాసానికి వెళ్లడం సైతం ఈ వాదనలకు బలం చేకూర్చుతోంది. దిల్లీలోని వీణా దేవి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి.. మరికొందరు ఎల్​జేపీ నేతలు సైతం హాజరైనట్లు సమాచారం. ఎల్​జేపీ నేతలు జేడీయూలోకి చేరాలని లలన్ సింగ్ కోరినట్లు తెలుస్తోంది. తనకు సన్నిహితులుగా ఉండే ఇతర నేతలను సైతం.. ఎల్​జేపీ ఎంపీలతో మాట్లాడేందుకు నితీశ్ పురమాయించారు. వీటన్నింటిని బట్టి ఇదంతా తెరవెనక నుంచి నడిపిస్తోంది నితీశేనని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. పశుపతి పరాస్ నేతృత్వంలోని ఎంపీల బృందమంతా నితీశ్ వెంట వెళ్లే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

"ఎల్​జేపీలో జరుగుతున్న పరిణామాల విషయంలో జేడీయూదే ప్రధాన పాత్ర. అందులో సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్​జేపీ తమకు హాని చేయకుండా ఉండి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని జేడీయూ నేతలు పదేపదే చెబుతున్నారు. ఎల్​జేపీ ప్రధాన నేతలంతా పశుపతి పరాస్​ను కలుస్తున్నారు."

-డాక్టర్ సంజయ్ కుమార్, రాజకీయ విశ్లేషకులు

"చిరాగ్ పాసవాన్ పార్టీపై పట్టు కోల్పోయారు. ఎల్​జేపీ ప్రాబల్యాన్ని తగ్గించాలని నితీశ్ కుమార్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో చాలా వరకు సఫలమయ్యారు. చిరాగ్ పాసవాన్​తో పనిచేసే విషయంపై పార్టీలో చాలా అసంతృప్తి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో నితీశ్ కుమార్ పాత్ర చాలా కీలకం."

-ప్రొఫెసర్ అజయ్ ఝా, రాజకీయ నిపుణుడు

"బిహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన తర్వాతే ఎల్​జేపీని దెబ్బతీసే కథాకమామిషు ప్రారంభమైంది. తొలుత చిరాగ్​కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ ఎల్​జేపీని జేడీయూ బాగానే మార్చేసింది. బిహార్​లో రాసిన స్క్రిప్ట్.. దిల్లీలో వర్కౌట్ అయింది. నితీశ్ కుమార్ ఈ మొత్తం ప్రక్రియ వెనక మాస్టర్ మైండ్."

-రవి ఉపాధ్యాయ్, సీనియర్ జర్నలిస్ట్

'మాకు సంబంధం లేదు'

అయితే, ఈ పరిణామాల వెనక జేడీయూ(JDU) పాత్రను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆర్​సీపీ సింగ్ ఖండించారు. ఎల్​జేపీలో ముదిరిన అసంతృప్తి జ్వాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. 'నాయకత్వం లభించినప్పుడు అన్నింటిని ముందుకు తీసుకెళ్లాలి. అందరికీ గౌరవం ఇవ్వాలి. మేం ఎల్​జేపీని దెబ్బతీయలేదు. చిరాగ్ పాసవాన్ ప్రవర్తన, ఏకపక్ష వైఖరి వల్లే ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు' అని సింగ్ పేర్కొన్నారు.

ఆర్​సీపీ సింగ్ వ్యాఖ్యలనూ కొట్టిపారేయలేని పరిస్థితి. ఎల్​జేపీని తుదముట్టించాలని జేడీయూ కంకణం కట్టుకోవడానికి తోడు చిరాగ్ పాసవాన్ వైఖరి కూడా ఎంపీల తిరుగుబాటుకు కారణమని రాజకీయ పండితులు చెబుతున్నారు.

కేబినెట్ ఖాయమా?

రాంవిలాస్ పాసవాన్ మృతి తర్వాత ఎల్​జేపీ పార్టీకి ఇది మరో అతిపెద్ద దెబ్బ. పాసవాన్ వారసుడిగా పగ్గాలు చేపట్టిన చిరాగ్.. పార్టీపై పట్టు కోల్పోతున్నారు. మరోవైపు, త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉందన్న వార్తల నేపథ్యంలో పశుపతి పరాస్​ను మంత్రివర్గంలోకి తీసుకునే విషయం సైతం చర్చల్లో ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: అయోధ్య ఆలయ భూమిపై వివాదం- అవినీతి నిజమేనా?

Last Updated : Jun 15, 2021, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.