ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న ముఠాలను ఏరివేసే లక్ష్యంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు చేపట్టింది. గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ స్మగ్లర్లు, మనుషుల అక్రమ రవాణా చేసే ముఠాలకు... ఉగ్రవాదులకు ఉన్న సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికే ఈ తనిఖీలు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీ-ఎన్సీఆర్లోని వివిధ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ఈ దాడులు చేపట్టాయి.
డ్రోన్ల అక్రమ చొరబాటుకు సంబంధించి ఈనెల 14న జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. గత 9 నెలలుగా పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి దాదాపు 191 డ్రోన్లు అక్రమంగా చొరబడినట్లు అధికారులు వెల్లడించారు. ఇది దేశ అంతర్గతభద్రతకు సంబంధించిన అంశం కావడంతో భద్రతాబలగాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అంతకుముందు గతనెల 12న దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ ముఠాలు సైబర్ స్పేస్‌ను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ ఆరోపించింది.
ఇదీ చదవండి: కశ్మీర్లో ఉగ్రదాడి.. ఇద్దరు యూపీ కూలీలు మృతి.. హైబ్రిడ్ ముష్కరుడు అరెస్ట్
హిమ సీమలో ఎన్నికల వేడి.. కమలం నిలుస్తుందా?.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా!