NIA raid ISIS: కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీఎం బాషా నివాసంపై ఎన్ఐఏ సోమవారం దాడులు చేపట్టింది. అతని కోడలైన దీప్తి మర్లా అలియాస్ మరియమ్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఎం ఇదినబ్బా కుమారుడైన బీఎం బాషా నివాసంపై ఎన్ఐఏ ఇదివరకు కూడా దాడులు చేపట్టింది. బీఎం బాషా కుటుంబానికి ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు గతేడాది ఆగస్టులో రైడ్లు నిర్వహించింది. ఈ క్రమంలో అతని కుమారుడు అమర్ అబ్దుల్ రెహ్మాన్‌ను అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మరియంను కూడా అనుమానించినా ఎన్ఐఏ అరెస్ట్ చేయలేదు.
కానీ అప్పటి నుంచి ఆమె కదలికలను గమనిస్తున్న ఎన్ఐఏ.. ఐసిస్ సహా జమ్ముకశ్మీర్ మిలిటెంట్లతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం అందడం వల్ల సోమవారం అమెను అరెస్ట్ చేసింది. ఐసిస్ కోసం యువతను చేర్చుకునే రాకెట్లో మరియం పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి : '81% కేసులు ఒమిక్రాన్‌వే'.. సాధారణ జ్వరంలాంటిదేనన్న సీఎం!