భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే(Bobde CJI).. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్‌ను(Bobde Mohan Bhagwat) మంగళవారం కలిశారు. నాగ్‌పుర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ఇరువురూ భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు(RSS Founder) డా. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఇంటిని కూడా మాజీ సీజేఐ సందర్శించినట్లు తెలిపాయి.
అయితే.. ఆర్ఎస్ఎస్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
జస్టిస్ బోబ్డే.. సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, సభ్యుడు భయ్యాజీ జోషీని కలిసినట్లు కొందరు వలంటీర్లు తెలిపారు. అయితే.. ఎందుకోసం సమావేశమైంది మాత్రం తెలియరాలేదు.
జస్టిస్ బోబ్డే(Bobde CJI) స్వస్థలం నాగ్‌పుర్. ఆయన న్యాయ విద్య అక్కడే అభ్యసించారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ అనంతరం.. ఆయన నాగ్‌పుర్‌లో ఉండేందుకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు.
జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ ఎన్వీ.రమణ(N.V.Ramana).. సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చూడండి: భారత్‌లో 'దక్షిణాఫ్రికా' కరోనా వేరియంట్- నిజమెంత?