ETV Bharat / bharat

కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ - ప్రధాని మోదీ కేబినెట్

కొత్తగా నియమితులైన కేబినెట్​ మంత్రులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రైల్వే శాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్, సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా అనురాగ్​ ఠాగూర్​ బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్య శాఖకు మాజీ మంత్రి హర్షవర్ధన్ స్థానంలో మన్​సుఖ్​ మాండవీయా బాధ్యతలు స్వీకరించారు.

new cabinet ministers take charge, కొత్త కేబినెట్​ మంత్రులు
కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ
author img

By

Published : Jul 8, 2021, 10:23 AM IST

Updated : Jul 8, 2021, 12:17 PM IST

ప్రధాని మోదీ కేబినెట్​లో కొత్తగా నియమితులైన మంత్రులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అనురాగ్​ ఠాకుర్​ బాధ్యతలు చేపట్టారు. అనురాగ్​ ఠాకుర్​కు క్రీడలు, యువజన వ్యవహాల మంత్రిగా కూడా కేంద్రం బాధ్యతలు అప్పగించింది.

new cabinet ministers take charge, కొత్త కేబినెట్​ మంత్రులు
సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్​ ఠాకుర్​

రైల్వే శాఖకు..

రైల్వే శాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్​ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని వైష్ణవ్​ పేర్కొన్నారు. రైల్వే శాఖ సహా వైష్ణవ్​.. ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్​ శాఖలకు కేబినెట్​ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

రైల్వే సహాయక మంత్రిగా దాన్వే రోవుసాహిబ్​ దాదారావ్​, దర్షన విక్రమ్​ జర్దోశ్​ బాధ్యలు తీసుకున్నారు.

ఆరోగ్య శాఖకు..

ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హర్షవర్ధన్ స్థానంలో మన్​సుఖ్​ మాండవీయా బాధ్యతలు స్వీకరించారు. ఆరోగ్య శాఖతో పాటు కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువులు శాఖలకు మంత్రిగా మన్​సుఖ్​కు కేంద్రం బాధ్యతలు అప్పగించింది.

ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయా

సహాయక మంత్రిగా డాక్టర్​ భారతీ పార్విన్ బాధ్యతలు స్వీకరించారు.

ఇతర శాఖలకు..

ఉక్కు శాఖ మంత్రిగా రామచంద్ర ప్రసాద్​ సింగ్​ బాధ్యతలు చేపట్టారు. విధుల్లో పారదర్శకంగా వ్యవహరిస్తానని ప్రసాద్​ సింగ్​ పేర్కొన్నారు. మరోవైపు న్యాయశాఖ మంత్రిగా మాజీ క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు బాధ్యతలు స్వీకరించారు. రిజిజు స్థానంలో ప్రస్తుతం క్రీడా శాఖ మంత్రిగా అనురాగ్​ ఠాకుర్​ కొనసాగనున్నారు.

న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజీజు

మోదీ కేబినెట్​ విస్తరణలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 43 మంది కేంద్ర మంత్రులుగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇదివరకు ఉన్న 53 మంత్రులలో 12 మందికి ఉద్వాసన పలికారు.

ఇదీ చదవండి : Cabinet Expansion: మోదీ కేబినెట్​లో భారీ ప్రక్షాళన

Last Updated : Jul 8, 2021, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.