ETV Bharat / bharat

డబ్బు కోసం హిజ్రా దారుణం- తల్లి నుంచి శిశువును లాక్కొని.. - హిజ్రాల దీవెనలు

అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి దగ్గర్నుంచి తీసుకున్న ఓ ట్రాన్స్​జెండర్(malda news)... డబ్బులిస్తేనే విడిచిపెడతానని డిమాండ్ చేశారు. చివరకు, హిజ్రా (eunuch blessing) ఒడిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బంగాల్​లో (West Bengal news) జరిగిందీ దారుణం.

హిజ్రా దారుణం
హిజ్రా దారుణం
author img

By

Published : Nov 19, 2021, 5:20 PM IST

శుభకార్యాలు జరిగే ఇళ్లల్లోకి వెళ్లి హిజ్రాలు దీవెనలు (eunuch blessing) అందించడం దేశంలో ఉన్న సంప్రదాయం. హిజ్రాలు దీవిస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం కూడా. ఇంటికి వచ్చి దీవించినందుకు ప్రతిగా హిజ్రాలకు కొంత డబ్బు ఇస్తుంటారు. అయితే, బంగాల్​లోని మాల్దా జిల్లాలో (malda news) ఈ సంప్రదాయం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

జిల్లాలోని బంగ్లా గ్రామంలో (West Bengal news) నివసించే మంపి సర్కార్ దంపతులు.. అక్టోబర్ 29న ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. గత బుధవారం (నవంబర్ 17న) మధ్యాహ్నం కొంతమంది హిజ్రాలు సర్కార్ ఇంటికి వెళ్లారు. పిల్లలకు దీవెనలు అందిస్తామంటూ రూ.5000 డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేమని సర్కార్ వారికి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో హిజ్రాలు వాదనకు దిగారు.

ఆరోగ్యం బాలేదని చెప్పినా...

అంతలోనే ఔలద్ అలీ అనే హిజ్రా.. ఓ శిశువును తన ఒడిలోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంటనే రూ.300 ఇస్తానని చెబితే దానికి హిజ్రా ఒప్పుకోలేదని సర్కార్ తెలిపారు. రూ.500 ఇస్తానన్నా వినిపించుకోలేదని అన్నారు. ఎక్కువ డబ్బులు ఇస్తేనే బిడ్డను తిరిగి ఇస్తానని అలీ మొండికేసినట్లు సర్కార్ వివరించారు. శిశువుకు పాలు పట్టేందుకూ అనుమతించలేదని చెప్పారు. చిన్నారికి ఆరోగ్యం బాలేదని చెప్పినా విడిచిపెట్టలేదన్నారు.

"మంగళవారం నుంచి చిన్నారి ఆరోగ్యం బాగాలేదు. ఆ రోజు నుంచి మందులు ఇస్తున్నాం. ఎక్కువ డబ్బులు ఇవ్వనిదే చిన్నారిని విడిచిపెట్టనని ఆ వ్యక్తి చెప్పారు. పాలు పట్టే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరకు బిడ్డను తిరిగి ఇచ్చే సరికి.. అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని అర్థమైంది."

-శిశువు తల్లి

ఈ వ్యవహారంపై మానిక్​చాక్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు సర్కార్. అలీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, చిన్నారిని ఐదు నిమిషాల్లోనే తల్లిదండ్రులకు అప్పగించినట్లు అలీ చెప్పుకొచ్చారు. శిశువును తాను చంపలేదని.. ఆ కుటుంబ సభ్యులే తనను కొట్టారని ఆరోపించారు.

హిజ్రా దారుణం
అలీ(మధ్యలో వ్యక్తి)ని అరెస్టు చేసిన పోలీసులు

ఇదీ చదవండి: 'తాలిబన్లపై విమర్శ' ​- పోర్న్ సైట్లలో ఆ మహిళ ఫోన్​ నంబర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.