ETV Bharat / bharat

కరోనా పంజా: భారత్​లో మరో కొత్త వేరియంట్​​! - కొవిడ్​ కొత్త వేరియంట్​

మరో కరోనా డబుల్​ మ్యూటెంట్​ వేరియంట్​ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఉన్న వైరస్​ విజృంభణకు కారణం ఈ వేరియంటే అనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది.

corona
భారత్​లో మరో కరోనా కొత్త వేరియంట్​​!
author img

By

Published : Mar 24, 2021, 3:47 PM IST

Updated : Mar 24, 2021, 4:10 PM IST

దేశంలో కొత్త రకం కరోనా వేరియంట్​ను గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఇది డబుల్ మ్యూటెంట్​ వేరియంట్​ అని పేర్కొంది. కొత్త వేరియంట్​తో పాటు ఇప్పటికే పలు వేరియంట్​లను 18 రాష్ట్రాల్లో గుర్తించామని స్పష్టం చేసింది.

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రస్తుత విజృంభణకు కారణం కొత్తగా గుర్తించిన ఈ డబుల్​ మ్యూటెంట్​ వేరియంటే అని స్పష్టంగా చెప్పలేమని తెలిపింది.

గతేడాది ఏర్పాటు చేసిన ఐఎన్​ఎస్​ఏసీఓజీ (ఇండియన్​ సార్స్​-సీఓవీ-2 కన్సార్టియమ్​ ఆన్​ జెనోమిక్స్) ఈ వేరియంట్లను గుర్తించింది. ఇప్పటివరకు ఐఎన్​ఎస్​ఏసీఓజీ ద్వారా 10,787 పాజిటివ్​ నమూనాలలో 771 వేరియంట్లను కనుగొన్నామని కేంద్రం వెల్లడించింది. ​ ​

"ఇప్పటివరకు గుర్తించిన 771 వేరియంట్లలో 736 యూకే వైరస్​కు, 34 దక్షిణాఫ్రికా వైరస్​కు, ఒకటి బ్రెజిల్​ వైరస్​కు చెందినది. మహారాష్ట్రలో గతేడాది డిసెంబరు కంటే ఇప్పటికి ఈ484క్యూ, ఎల్​452ఆర్​ మ్యూటెంట్ల వ్యాప్తి స్వల్పంగా పెరిగింది. ఈ డబుల్​ మ్యూటెంట్​ వేరియంట్​ సహా కొత్త వేరియంట్లకు సంబంధించిన కేసులు ఎక్కువగా గుర్తించలేకపోవడం వల్ల వీటి వ్యాప్తిపై ఏ విషయం స్పష్టంగా చెప్పలేము."

-కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ఇదీ చదవండి : మహారాష్ట్రలో కరోనా రికార్డు- ఒక్కరోజే 30వేల కేసులు ​ ​

Last Updated : Mar 24, 2021, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.