దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. మొత్తం కేసులు 3 కోట్లు దాటాయి. కొత్తగా 50,848 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 1358 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 30,028,709
- యాక్టివ్ కేసులు: 6,43,194
- కోలుకున్నవారు: 2,89,94,855
- మొత్తం మరణాలు: 3,90,660
దేశంలో రికవరీ రేటు 96.56శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా మంగళవారం 19,01,056 లక్షల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది.
వ్యాక్సినేషన్..
ఒక్కరోజే 54,24,374 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 29,46,39,511కు చేరినట్లు చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం ఆందోళన..
డెల్టా ప్లస్ రకాన్ని.. 'ఇండియన్ సార్స్-కోవ్-2 కన్ఫార్షియం ఆన్ జీనోమిక్స్ (ఇన్సాకాగ్)' ప్రస్తుతం ఆందోళనకర రకం (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)గా పేర్కొన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనిలో సంక్రమణశక్తి పెరగడం, ఊపిరితిత్తుల కణాల్లోని గ్రాహకాలతో గట్టిగా బంధాన్ని ఏర్పరచడం, మోనాక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇన్ఫాకాగ్ పేర్కొంది.
ఇవీ చదవండి: