ETV Bharat / bharat

సీఈసీగా రాజీవ్​ బాధ్యతలు- 2024 లోక్​సభ ఎన్నికలకు ఆయనే సారథి!

CEC Rajiv kumar: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా.. రాజీవ్​ కుమార్​ బాధ్యతలు చేపట్టారు. 2025 ఫిబ్రవరి వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.

cec rajiv kuma
సీఈసీగా రాజీవ్​ బాధ్యతలు- 2024 లోక్​సభ ఎన్నికలకు ఆయనే సారథి!
author img

By

Published : May 15, 2022, 1:39 PM IST

New CEC of India: కేంద్ర ఎన్నికల సంఘం 25వ ప్రధాన కమిషనర్​(సీఈసీ)గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్ సదన్​లో ఆయన ఆదివారం సీఈసీగా విధుల్లో చేరారు. ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్​గా ఉన్న సుశీల్​ చంద్ర.. శనివారమే పదవీ విరమణ చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను ఇటీవల రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఫిబ్రవరి వరకు రాజీవ్​ సీఈసీగా ఉంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు 2024లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఆయన సారథ్యంలోనే జరగనున్నాయి.

1960 ఫిబ్రవరి 19న జన్మించిన రాజీవ్.. బీఎస్సీ, ఎల్​ఎల్​బీ, పీజీడీఎం, ఎంఏ(పబ్లిక్ పాలసీ) చేశారు. బిహార్​/ఝార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి(1984 బ్యాచ్) అయిన ఆయన.. 2020 ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. 2020 సెప్టెంబర్​ 1న ఎన్నికల కమిషనర్​గా రావడానికి ముందు 'ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక మండలి' ఛైర్​పర్సన్​గా సేవలందించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.