దేశంలో ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఆపరేషన్ సముద్ర సేతు-2 పేరుతో భారత్‌కు ఆక్సిజన్ నిండిన కంటైనర్లను రవాణా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కింద.. ద్రవ ఆక్సిజన్ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లు, అనుబంధ వైద్య పరికరాలను యుద్ద నౌకల ద్వారా నౌకాదళం రవాణా చేయనుంది.




ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ తల్వార్ అనే రెండు యుద్ధ నౌకలు.. బహ్రెయిన్‌లోని మనామా నౌకాశ్రయం నుంచి ఆక్సిజన్‌ను తరలిస్తుండగా... బ్యాంకాక్ నుంచి ఐఎన్ఎస్ జలష్వా, సింగపూర్ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్ ఆక్సిజన్‌ను తరలిస్తున్నట్లు భారత నౌకాదళం వెల్లడించింది.



'వందే భారత్ మిషన్'లో భాగంగా ఆపరేషన్ సముద్ర సేతును భారత నౌకాదళం ప్రారంభించింది. మాల్దీవులు, శ్రీలంక, ఇరాన్‌లలో చిక్కుకుపోయిన సుమారు 4వేల మంది భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చింది.
ఇదీ చూడండి: కరోనాపై భయాలొద్దు.. ఇవి తెలుసుకోండి
ఇదీ చూడండి: 'ప్రజలకు అందుబాటులో ఉండండి.. అండగా నిలవండి'