ETV Bharat / bharat

Navratri 2023 Kanya Puja : నవరాత్రుల్లో కన్యా పూజ.. ఏ వయసు బాలికను పూజించాలో తెలుసా..? - దేవీ శరన్నవరాత్రులు 2023

Navratri Kanya Puja 2023 : దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి. అయితే.. ఈ ఉత్సవాల్లో కన్యా పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. మరి, ఈ పూజ ఎప్పుడు చేయాలి? దాని విశిష్టత, నియమాలు ఏంటీ? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Navratri 2023 Kumari Puja
Navratri 2023 Kanya Puja
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 2:15 PM IST

Navratri Kanya Puja 2023 Date : దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ నవరాత్రుల్లో శక్తి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శారదీయ నవరాత్రుల్లో(Shardiya Navratri 2023) భాగంగా దుర్గాదేవిని 9 రోజుల్లో.. తొమ్మిది రూపాల్లో భక్తులు అత్యంత నియమనిష్ఠలు, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పూజల్లో భాగంగానే కన్యా పూజ కూడా చేస్తారు. అమ్మవారికి చిహ్నంగా భావించి.. 9 మంది బాలికలకు ప్రత్యేక పూజలను చేసే సంప్రదాయం ఉంది.

దేవీ శరన్నవరాత్రులలో దుర్గాదేవి స్వరూపంగా భావిస్తూ.. 9 రోజులు ఒక్కొక్క బాలికను కొందరు ఆరాధిస్తారు. మరికొందరు.. నవరాత్రుల ముగింపు రోజున అంటే అష్టమి లేదా నవమి నాడు తొమ్మిది మంది అమ్మాయిలను ఒకేసారి పూజిస్తారు. అయితే.. ఈ సంవత్సరం నవరాత్రుల్లో కన్యా పూజ(Navratri Kanya Puja) ఎప్పుడు వచ్చింది? దాని విశిష్టత ఏంటి? ఏ వయసు బాలికను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

When Is Kumari Puja in Navratri 2023 : ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 24 వరకు కొనసాగనున్నాయి. నవరాత్రుల్లో ఎనిమిదో రోజు(అష్టమి తిథి) చాలా ముఖ్యమైనది. ఆ రోజు అమ్మవారి ఎనిమిదో రూపమైన మహాగౌరిని పూజించడంతోపాటు కన్యా పూజ కూడా చేస్తారు. దీనినే కొన్ని చోట్ల కుమారి పూజ అని కూడా పిలుస్తారు. అయితే.. ఈ సంవత్సరం అష్టమి తిథి అక్టోబర్ 21, 2023 రాత్రి 9.53 గంటల నుంచి 22, 2023 రాత్రి 7:58 గంటల వరకు ఉంది. తదుపరి నవమి తిథి ఉంది. ఈ రెండు రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో.. కన్యా/కుమారి పూజ అంటే ఏమిటో చూద్దాం.

"కుమారి" అనే పదం యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిని సూచిస్తుంది. ఆమె దైవిక స్త్రీ శక్తి స్వరూపంగా పరిగణించబడుతుంది. దుర్గాదేవిని సూచిస్తుంది. అందువల్ల ఈ నవరాత్రల వేడుకలో ఆమెను పూజిస్తారు. ఈ పూజను కుమారి పూజ లేదా కుమారి అష్టమి అని కూడా పిలుస్తారు. దేవీ శరన్నవరాత్రులలో పూజించబడే తొమ్మిది మంది బాలికల్లో ఒక్కో వయసు అమ్మాయికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.

ఏ వయసు బాలిక ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారంటే..?

  • నవరాత్రుల్లో రెండేళ్ల బాలికను.. కుమారిగా
  • మూడేళ్ల బాలికను.. త్రిమూర్తిగా
  • నాలుగేళ్ల బాలికను.. కళ్యాణిగా
  • ఐదేళ్ల బాలికను.. రోహిణిగా
  • ఆరేళ్ల బాలికను.. కాళికగా
  • ఏడేళ్ల బాలికను.. చండికగా
  • ఎనిమిదేళ్ల బాలికను.. శాంభవిగా
  • తొమ్మిదేళ్ల బాలికను.. దుర్గగా
  • పదేళ్ల బాలికను.. సుభద్రగా పరిగణిస్తారు.

Navratri 2023 : నవరాత్రుల్లో.. ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరో మీకు తెలుసా..?

నవరాత్రులలో కుమారి పూజ ఫలం వివరాలు చూస్తే..

  • దేవీ శరన్నవరాత్రుల్లో రెండేళ్ల బాలికను పూజిస్తే దారిద్య్రం తొలగిపోతుందట
  • మూడేళ్ల బాలికను పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం
  • నాలుగేళ్ల అమ్మాయిని పూజించడం వల్ల సాధకుని జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలూ తొలగిపోతాయి.
  • ఐదేళ్ల బాలికను ఆరాధించడం వల్ల శరీరంలోని రుగ్మతలు తగ్గిపోయి, దుఃఖం తొలగుతుందని నమ్మకం
  • ఆరేళ్ల అమ్మాయికి పాదపూజ చేయడం ద్వారా సాధకుడికి విద్య, విజయం లభిస్తాయి.
  • ఏడేళ్ల బాలికను ఆరాధిస్తే గౌరవం, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం.
  • ఎనిమిదేళ్ల బాలికకు పూజలు చేయడం ద్వారా.. వివాదాలు పరిష్కారం అవుతాయట.
  • తొమ్మిది సంవత్సరాల బాలికను పూజించడం ద్వారా కష్టమైన పనులు నెరవేరువుతాయి.
  • పదేళ్ల బాలికను పూజిస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

Navratri 2023 : దేవీ శరన్ననవరాత్రులకు.. ఒక్కోచోట ఒక్కో పేరు..! అవేంటో మీకు తెలుసా..?

Devi Navratris 2023 What To Wear : దేవీ నవరాత్రులు.. తొమ్మిది రోజులు 9 వస్త్రాలు ధరించాలి.. అవేంటో మీకు తెలుసా..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.