ETV Bharat / bharat

హైకమాండ్​​ ఆర్డర్​.. పీసీసీ చీఫ్​ పదవికి సిద్ధూ రాజీనామా

Navjot Singh Sidhu: ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర పార్టీ చీఫ్​ పదవి నుంచి తప్పుకున్నారు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ. ఇప్పటికే ఉత్తరాఖండ్​ పీసీసీ చీఫ్​ రాజీనామా చేశారు.

Navjot Singh Sidhu resigns as Punjab Congress Chief

author img

By

Published : Mar 16, 2022, 11:50 AM IST

Navjot Singh Sidhu: ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఓటమికి బాధ్యత వహిస్తూ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఉత్తరాఖండ్‌ పీసీసీ అధ్యక్షుడు తన పదవి నుంచి వైదొలగగా.. తాజాగా పంజాబ్‌ పార్టీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ''కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కోరిన విధంగా నేను నా పదవికి రాజీనామా చేశా.'' అని ట్విట్టర్‌లో పేర్కొన్న సిద్ధూ.. రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. సిద్ధూ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ పదవి చేపట్టారు.

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా పీసీసీ సారథులపై వేటు వేస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ విభాగాలను పునర్‌వ్యవస్థీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఆమె ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ట్విట్టర్​లో మంగళవారం వెల్లడించారు. యూపీలో అజయ్‌కుమార్‌ లల్లూ, పంజాబ్‌లో నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ, ఉత్తరాఖండ్‌లో గణేశ్‌ గోదియాల్‌, మణిపుర్‌లో ఎన్‌.లోకెన్‌సింగ్‌, గోవాలో గిరీశ చోడంకర్‌ పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు.

Sonia Gandhi PCC chiefs resign: సోనియా ఆదేశాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఉత్తరాఖండ్‌లో గణేశ్‌ గోదియాల్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్​‌లో ప్రకటించారు. తాజాగా సిద్ధూ పీసీసీ చీఫ్‌ పదవి నుంచి తప్పుకొన్నారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. ఏకంగా సీఎం సహా అనేక మంది రాజకీయ దిగ్గజాలను మట్టికరిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేసిన సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు. అయితే ఫలితాల తర్వాత సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం చేశారు. పంజాబ్‌ ప్రజలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చూడండి: సీడబ్ల్యూసీ భేటీ.. సోనియా, రాహుల్​ నాయకత్వానికే జై!

షాకిచ్చిన సోనియా.. పీసీసీ అధ్యక్షుల రాజీనామాకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.