ETV Bharat / bharat

ఆ లక్ష్యాన్ని గడువుకు ముందే చేరుకున్నాం: మోదీ - నరేంద్ర మోదీ కా సమాచార్

Narendra Modi Himachal Pradesh: హిమాచల్​ ప్రదేశ్​లో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రూ.11వేల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. దేశంలో 2030 నాటికి 40 శాతం శిలాజేతర ఇంధనాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేపట్టాలనే లక్ష్యాన్ని గడువుకన్నా ముందుగానే చేరుకున్నామని తెలిపారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు.

narendra-modi-himachal-pradesh
'హిమాచల్​' పర్యటనలో మోదీ
author img

By

Published : Dec 27, 2021, 1:47 PM IST

Updated : Dec 27, 2021, 2:52 PM IST

Narendra Modi Himachal Pradesh: దేశంలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంలో 40 శాతం శిలాజేతర ఇంధనాల ద్వారానే చేపట్టాలనే లక్ష్యాన్ని గడువుకన్నా ముందుగానే సాధించామని తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. శిలాజేతర ఇంధనాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని 2030 నాటికి 40 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అయితే, 2021లోనే దానిని సాధించామన్నారు. హిమాచల్​ప్రదేశ్​లో​ పలు హైడ్రోపవర్​ ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

" 2030 నాటికి దేశంలో శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం విద్యుత్తు ఉత్పత్తిని చేపట్టాలని 2016లో లక్ష్యంగా పెట్టుకున్నాం. 2021 నవంబర్​లోనే ఆ లక్ష్యాన్ని చేరుకోవటం ప్రతి భారతీయుడికి గర్వకారణం. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్​పై ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. సౌర విద్యుత్తు, జల విద్యుత్తు, పవన విద్యుత్తు, గ్రీన్​ హైడ్రో పవర్.. ఇలా ప్రతి పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించుకునేందుకు భారత్​ కృషి చేస్తోంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

హిమాచల్​ప్రదేశ్​లో భాజపా ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వేళ ఆ రాష్ట్రంలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా హమిర్​పుర్​ జిల్లాలో రూ.680 కోట్లతో నిర్మించిన ధౌలా సిద్ధు జల విద్యుత్​​ ప్రాజెక్ట్​ను ప్రారంభించారు. దీని సామర్థ్యం 66 మెగావాట్లు. మొత్తంగా రూ.11,281 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

హిమాచల్​ ప్రదేశ్​ గ్లోబల్​ ఇన్వెస్టర్స్​ రెండో సదస్సుకు అధ్యక్షత వహించారు ప్రధాని మోదీ. రూ.28వేల కోట్లు విలువైన 287 ప్రాజెక్టుల ప్రారంభం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకుంటాయని అధికార వర్గాలు తెలిపాయి.

హిమాచల్​ ప్రదేశ్​లో ముఖ్యమంత్రి జైరామ్​ ఠాకూర్​ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం 2017, డిసెంబర్​ 27న కొలువుదీరింది. సిమ్లాలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.

ఇదీ చూడండి: 'ఆరోగ్య సూచీ'లో కేరళ టాప్​- తెలంగాణకు మూడో ర్యాంక్​

Last Updated : Dec 27, 2021, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.