ETV Bharat / bharat

కాంచెన్‌జంగా పర్వతం అధిరోహిస్తూ భారతీయుడు దుర్మరణం - నేపాల్ న్యూస్​

Narayan Iyer Kanchenjunga: నేపాల్‌లోని కాంచెన్‌జంగా పర్వత శిఖరాన్ని అధిరోహిస్తూ 52 ఏళ్ల భారతీయ పర్వతారోహకుడు మరణించారు. మహారాష్ట్రకు చెందిన నారాయణన్​ అయ్యర్​.. 8200 మీటర్ల ఎత్తు వద్ద కుప్పకూలినట్లు యాత్ర నిర్వాహకులు తెలిపారు.

kanchenjunga height
kanchenjunga height
author img

By

Published : May 6, 2022, 9:57 PM IST

Narayan Iyer Kanchenjunga: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పర్వతంగా పేరొందిన కాంచెన్‌జంగా పర్వతాన్ని అధిరోహిస్తూ ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రకు చెందిన 52 ఏళ్ల నారాయణన్ అయ్యర్ అనే పర్వతారోహకుడు కాంచెన్‌జంగా ఎక్కుతూ తుదిశ్వాస విడిచారు. కాంచెన్‌జంగా పర్వతం ఎత్తు 8 వేల 586 మీటర్లు కాగా.. సుమారు 8,200 మీట‌ర్ల ఎత్తు వ‌ద్ద అయ్యర్ కుప్పకూలినట్లు అడ్వెంచర్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇద్దరు గైడ్లు సహకరించినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు. అయ్యర్ కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు నిర్వాహాకులు తెలిపారు.

kanchenjunga height
నారాయణన్​ అయ్యర్​

8200 మీట‌ర్ల వద్ద నారాయణన్​ అనారోగ్యానికి గురికాగా.. నిర్వాహకులు కిందకు దిగమని కోరగా ఆయన నిరాకరించారు. అదే ఆయన మరణానికి కారణమైందని నిర్వాహకులు నివేశ్​ కర్కీ అన్నారు. డెత్ జోన్‌గా పిలిచే ఎత్తైన ప్రాంతం నుంచి అయ్యర్ మృతదేహాన్ని వెలికితీసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, మరో నలుగురు భారతీయ అధిరోహకులు భగవాన్ భికోబా చావ్లే, (39), మనీషా రిషి గైండ్ (47), పంకజ్ కుమార్ (21), ప్రియాంక మంగేష్ మోహితే (29) కాంచెన్‌జంగా శిఖరాన్ని అధిరోహించారు. వీరితో పాటు అమెరికా, తైవాన్​కు చెందిన పర్వాతారోహకులు సైతం అధిరోహించారు. కొవిడ్​ కారణంగా 2020లో మూసివేసిన పర్వతయాత్రను నేపాల్ ప్రభుత్వం తాజాగా పునఃప్రారంభించింది.

ఇదీ చదవండి: 'రూ.2500 కోట్లు ఇస్తే సీఎం నువ్వే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.