ETV Bharat / bharat

నాగార్జునసాగర్‌ నిర్వహణ ఎవరిది? - తెలంగాణ, ఏపీల మధ్య తేలని పంచాయితీ - Telugu States Sagar Issue

Nagarjuna Sagar Dam Issue : నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనే అంశంపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులు ముందడుగు పడడం లేదు. వానాకాలం నిల్వకు అనుగుణంగా ప్రాజెక్టును సిద్ధం చేసుకునేందుకు ఇదే సరైన సమయం కాగా తెలంగాణ వైపు మాత్రమే సంబంధిత పనులు సాగుతున్నాయి.

Nagarjuna Sagar Project Dispute
Nagarjuna Sagar Dam Issue
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 9:29 AM IST

నాగార్జునసాగర్‌ నిర్వహణ ఎవరిది?

Nagarjuna Sagar Dam Issue : నాగార్జున సాగర్‌ నిర్వహణ విషయంలో నెలకొన్న సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనే అంశంపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులు ముందడుగు పడడం లేదు. గేట్లు, రోప్‌లకు గ్రీజ్‌లు పూయడం, జనరేటర్లు, గేట్లు తెరిచేందుకు ఉపయోగించే ట్రక్‌ నిర్వహణ లాంటి ప్రోటోకాల్స్‌ను ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు ఎప్పటికప్పుడు చేపడుతుంటారు. వానాకాలం నిల్వకు అనుగుణంగా ప్రాజెక్టును సిద్ధం చేసుకునేందుకు ఇదే సరైన సమయం కాగా తెలంగాణ వైపు మాత్రమే సంబంధిత పనులు సాగుతున్నాయి. ప్రాజెక్టు విషయంలో, నిర్లక్ష్యానికి ఇప్పటికీ ఉన్న అస్పష్టతే కారణం.

Telugu States Sagar Dam Issue : శాసనసభ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. బోర్డుకు ఇండెంట్‌ ఇస్తున్నా తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని, 13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్‌ చేసుకుంటామని ఏపీ ప్రకటించింది. ఇదే విషయాన్ని కృష్ణ బోర్డుకు రాసిన లేఖలో ప్రస్తావించింది.

నాగార్జునసాగర్​కు 69 ఏళ్లు - నూతన వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగింటి బంధం

ప్రస్తుతం 13వ క్రెస్ట్‌ నుంచి ఏపీ పరిధిలో మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉన్నది. తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తలు తలెత్తిన సమయంలో కేంద్ర బలగాల రంగ ప్రవేశంతో కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, కృష్ణా బోర్డుకు చెందిన ఇద్దరు అధికారులు క్షేత్ర స్థాయి పరీశీలన చేశారు.

సాగర్‌ వద్ద పూర్వ పరిస్థితిని పునరుద్ధరించాలంటూ కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

Nagarjuna Sagar Project Dispute : ఐతే ఏపీ పునర్వ్యవస్థీకణ చట్టం ప్రకారం సాగర్‌ నిర్వహణ తెలంగాణే చూస్తుందని, కాబట్టి వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్‌ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరుతోంది. తాజాగా ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌కు లేఖ రాసినట్లు సమాచారం.

ఏపీ అధీనంలో ఉన్న, 13వ గేటు వరకే పనులు చేస్తున్నామని, డ్యాం మొత్తం అప్పగిస్తే తప్ప పూర్తిచేయలేమని ఆ లేఖలో రాసినట్లు విశ్వసనీయం సమాచారం. అదే లేఖలో రోజువారీ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోతో పాటు విద్యుదుత్పత్తికి సంబంధించి వివరాలు నమోదు చేయలేకపోతున్నామని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. రెండు వైపులా ఉన్న కాలువల లీకేజీ నీటి విడుదల విషయాలు నమోదు చేయాల్సి ఉండగా ఏపీ వైపునున్న సమాచార సేకరణ లభ్యమవడం లేదని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సందిగ్ధత తీరిపోయేలా కేంద్రం చర్యలు ఉంటాయని అంతా ఆశిస్తున్నారు.

సాగర్ డ్యామ్ ఘటన - తెలంగాణ అభ్యర్థనతో జలశక్తి శాఖ కీలక భేటీ వాయిదా

'నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంలో యథాతథ స్థితి కొనసాగింపునకు ఇరు రాష్ట్రాల అంగీకారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.