ETV Bharat / bharat

మయన్మార్​లో నిరసనకారులపై సైన్యం స్నైపర్​ దాడులు - తెలుగు వార్తలు

myanmar-junta-use-snipers-to-fire-on-pro-democracy-protesters-several-dead-over-50-people-arrested
మయన్మార్​లో నిరసనకారులపై సైన్యం స్నైపర్​ దాడులు
author img

By

Published : Feb 28, 2021, 10:28 AM IST

Updated : Feb 28, 2021, 2:15 PM IST

10:24 February 28

మయన్మార్​లో నిరసనకారులపై సైన్యం స్నైపర్​ దాడులు

మయన్మార్​లో నిరసనకారులపై సైన్యం స్నైపర్​ దాడులు

ప్రజాస్వామ్య అనుకూలవాదులు చేస్తున్న నిరసనలపై మయన్మార్​ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టిన వారిపై స్నైపర్లతో దాడి చేయించింది. ఈ ఘటనలో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. ఎనిమిది మంది గాయపడ్డారు.

50 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకుంది సైన్యం. నిరసనకారులపై నిజమైన తూటాలతో దాడి చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ఓ నెటిజన్ వెల్లడించారు. మయన్మార్ వ్యాప్తంగా స్నైపర్లను సైన్యం మోహరించిందని చెప్పారు.

నిరసన చేస్తున్న టీచర్లపై ఆదివారం ఉదయం స్టన్​ గన్​లతో సైన్యం దాడికి పాల్పడిందని మరో నెటిజన్ తెలిపారు. థింగాంగ్యున్ టౌన్​షిప్​లో ఓ నిరసనకారుడు మృతి చెందాడని చెప్పారు. దావేయి ప్రాంతంలోనూ ఓ వ్యక్తి మరణించాడని పేర్కొన్నారు. మావ్లామ్యాయింగ్​లో ఒకరు, యంగోన్​లో ఇద్దరు మృతి చెందినట్లు మరొక నెటిజన్ తెలిపారు.

Last Updated : Feb 28, 2021, 2:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.