ETV Bharat / bharat

Mohan Bhagwat RSS: 'దేశంలోని ప్రతి ఒక్కరు హిందువే' - అందరూ హిందువులే

భారత్​లో ఉండే ప్రతి ఒక్కరు హిందువులేనని ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భగవత్​(Mohan Bhagwat) అన్నారు. దేశంలోని హిందువులు, ముస్లిముల మూలాలన్నీ ఒక్కటే అని పేర్కొన్నారు.

everyone in india is hindu
మోహన్​ భాగవత్​
author img

By

Published : Sep 7, 2021, 6:51 AM IST

దేశంలోని హిందువులు, ముస్లిముల మూలాలన్నీ ఒక్కటే అని ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భగవత్(Mohan Bhagwat​ RSS) పేర్కొన్నారు. ప్రతి భారతీయుడూ హిందువే అని వ్యాఖ్యానించారు. తెలివైన ముస్లిం నాయకులు మతోన్మాదులకు వ్యతిరేకంగా నిలవాలన్నారు. హిందువులు ఎవరి పట్ల శత్రుత్వం చూపరని, దేశంలోని మైనార్టీలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

గ్లోబల్​ స్ట్రాటజిక్​ పాలసీ ఫౌండేషన్​ సంస్థ ముంబయిలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్(Mohan Bhagwat)​ ఈ వ్యాఖ్యలు చేశారు.

జావేద్​ అక్తర్​ వ్యాఖ్యలపై దుమారం...

హిందుత్వ సంస్థలను తాలిబన్​తో పోలుస్తూ బాలీవుడ్​ ప్రముఖ రచయిత జావేద్​ అక్తర్​(Javed Akhtar) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. తాలిబన్​లు ఇస్లాం దేశాన్ని కోరుకుంటున్నారు. వీరు హిందూ దేశాన్ని కోరుకుంటున్నారు. అంటూ ఏ సంస్థ పేరునూ ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

హిందూ దేశ అనుకూలవాదులను తాలిబన్ల మనస్తత్వం ఉన్నవారిగా పేర్కొనడం ఏంటని శివసేన ప్రశ్నించింది. సమాజాన్ని గందరగోళపరిచే కుట్రలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్వహిందూ పరిషత్​ వ్యాఖ్యానించింది. మరోవైపు జావేద్​ క్షమాపణలు చెప్పేవరకూ తన సినిమాలను దేశంలో ఆడనివ్వమని భాజపా ఎమ్మెల్యే రామ్​ కదమ్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి: Supreme Court: 'పంజరంలో చిలకలాగే సీబీఐ.. దానికి స్వేచ్ఛ ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.