ముంబయి పోలీస్ కమిషనర్‌గా పరమ్‌బీర్ సింగ్‌ను తొలగించడంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. అనిల్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో.. పరమ్‌బీర్ సహచరులు చేసిన తీవ్రమైన తప్పిదాల కారణంగానే ఆయన బదిలీ అయ్యారని దేశ్‌ముఖ్ వెల్లడించారు. బాంబు కేసు దర్యాప్తు సవ్యంగా జరపాలనే ఉద్దేశంతోనే ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేసినట్టు చెప్పారు.
ఈ కేసును మహారాష్ట్ర ఉగ్ర నిరోధక సంస్థ(ఏటీఎస్), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్నట్లు దేశ్‌ముఖ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: 'అంబానీ ఇంటి వద్ద బాంబు'పై ఎన్ఐఏ దర్యాప్తు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద బాంబు కేసు దర్యాప్తులో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పరమ్‌బీర్ సింగ్‌ను హోం గార్డు విభాగానికి డైరెక్టర్ జనరల్(డీజీ)గా బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన స్థానంలో హేమంత్ నగ్రాలేను నియమించింది.
ఇదీ చదవండి: పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజేనే: ఎన్ఐఏ