ETV Bharat / bharat

మమత స్కెచ్​తో సువేందుకు షాక్- ఆ పదవికి దూరం! - బంగాల్​ రాజకీయాలు

బంగాల్​ అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్​గా టీఎంసీ సీనియర్​ నేత ముకుల్​రాయ్​ను నియమించడంపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముకుల్​ రాయ్​ నియామకాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలోని భాజపా ఎమ్మెల్యేలు సభ నుంచి వాక్​ఔట్​ చేశారు.

suvendu adhikari
సువేందు అధికారి
author img

By

Published : Jul 9, 2021, 7:18 PM IST

Updated : Jul 9, 2021, 10:05 PM IST

తృణమూల్​ కాంగ్రెస్​ సీనియర్​ నేత ముకుల్​ రాయ్​ను బంగాల్​ అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్​గా స్పీకర్​ బిమన్​ బెనర్జీ నియమించడం.. గందరగోళానికి దారి తీసింది. ముకుల్​ రాయ్​ నియామకాన్ని నిరసిస్తూ.. ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలోని భాజపా ఎమ్మెల్యేలు.. సభ నుంచి వాక్​ఔట్​ చేశారు.

క్రిష్ణానగర్ ఉత్తర్​ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు ముకుల్​ రాయ్. అనంతరం ఆయన టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ముకుల్​ రాయ్​ను​ తన పదవికి రాజీనామా చేయాలని భాజపా చాలారోజుల నుంచి డిమాండ్​ చేస్తోంది. అయితే.. జూన్​లో పీఏసీ సభ్యుడిగా ముకుల్​ రాయ్​ ఎంపికయ్యారు. ఇప్పుడు ఆయనను ఈ కమిటీకి ఛైర్మన్​గా బంగాల్​ అసెంబ్లీ స్పీకర్​ ప్రకటించారు.

'టీఎంసీ కాలరాసింది..'

ముకుల్​ రాయ్​ నియామకంపై భాజపా నేత సువేందు అధికారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పీఏసీ కమిటీకి ప్రతిపక్ష సభ్యులనే ఛైర్మన్​గా నియమించే సంప్రదాయాన్ని టీఎంసీ కాలరాసి.. ముకుల్​ రాయ్​కు ఆ పదవి కట్టబెట్టిందని ధ్వజమెత్తారు.

"ముకుల్​ రాయ్​ను స్పీకర్​ తన అధికారాలు ఉపయోగించి పీఏసీ ఛైర్మన్​గా నియమించారు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ వ్యక్తి పేరూ లేకుండా ఛైర్మన్​ను నియమించడం ఇదే తొలిసారి."

-సువేందు అధికారి, బంగాల్ ప్రతిపక్ష నేత

ఇదీ చూడండి: టిబెట్​ యువతతో చైనా సైన్యం దుష్ట పన్నాగం!

ఇదీ చూడండి: Sedition: ఆ పోలీసు అధికారిపై దేశద్రోహం కేసు!

Last Updated : Jul 9, 2021, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.