ETV Bharat / bharat

మరో శ్రద్ధా వాకర్ తరహా ఘటన.. ప్రియురాలిని హత్య చేసి మృతదేహంతో వీడియో! - ప్రియురాలి హత్య

ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మృతదేహంతో వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ ప్రియుడు. ఈ కిరాతక ఘటన నవంబర్​ 8న మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లోని ఓ రిసార్ట్​లో జరిగింది.

madhya pradesh girlfriend murder
madhya pradesh girlfriend murder
author img

By

Published : Nov 16, 2022, 7:58 PM IST

దిల్లీలో శ్రద్ధా వాకర్ దారుణ హత్య మరువకముందే మరో ఘాతుకం జరిగింది. ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మృతదేహంతో వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ ప్రియుడు. ఈ ఘటన నవంబర్​ 8న మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లోని ఓ రిసార్ట్​లో జరిగింది. నిందితుడిని పటాన్​కు చెందిన అభిజిత్​ పాటిదార్​గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన జరిగి వారం గడుస్తున్నా ఇప్పటికీ అతడిని అరెస్ట్ చేయలేదు.

ఈ వీడియోలో రక్తపు మడుగులో ఉన్న మృతురాలిని చూపిస్తూ తనను మోసం చేయవద్దంటూ నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. మృతురాలిని జబల్​పుర్​ జిల్లాలోని కుందాం ప్రాంతానికి చెందిన శిల్పా ఝరియా(22) గుర్తించామని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. సాక్ష్యాలను సేకరించారు. నిందితుడు గుజరాత్​ నుంచి మధ్యప్రదేశ్​కు వలస వచ్చాడని.. ఇన్​స్ట్రాగ్రామ్​లో వీడియో పోస్ట్ చేశాడని వివరించారు. నిందితుడు ఆచూకీ లభించిందని.. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని వెల్లడించారు.

ఇవీ చదవండి: శ్రద్ధ మర్డర్ కేసు.. 12 బాడీ పార్ట్స్ స్వాధీనం.. జైలులో ప్రశాంతంగా నిందితుడి నిద్ర!

క్రైమ్ సిరీస్ స్ఫూర్తితో ప్రేయసి హత్య.. శవాన్ని 35 ముక్కలు చేసి.. ఫ్రిజ్​లో ఉన్న ముఖాన్ని రోజూ చూస్తూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.