మధ్యప్రదేశ్‌కు చెందిన రవిప్రసాద్ మాలి(58).. తన భార్య అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాడు. తన భార్య గ్రామానికి చేరుకునేందుకు 13 గంటలు పట్టిందని చెప్పుకొచ్చాడు.
ఏం జరిగిందంటే?
మతిస్థిమితంలేని రవిప్రసాద్ మాలి భార్య బబ్లీ.. మధ్యప్రదేశ్ అగర్ మల్వాలోని తన సోదరుడి ఇంట్లో ఉంటుంది. అయితే మే 8న అనారోగ్య సమస్యలతో బబ్లీ మరణించింది. కరోనా కారణంగా గ్రామంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు భావించారు. ఆ విషయం తెలుసుకున్న రవిప్రసాద్.. భార్య గ్రామానికి వెళ్లేందుకు వాహనాల కోసం గంటలపాటు ఎదురుచూశాడు. లాక్డౌన్ కారణంగా .. వాహనాలు లేక సైకిల్‌పైనే అగర్ మాల్వా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 13 గంటల్లో గమ్యాన్ని చేరుకున్నాడు.
ఇదీ చదవండి : ఒకే కారుతో మూడు రాష్ట్రాల్లో బీభత్సం- చివరకు...