కొవిడ్-19 మహమ్మారిపై ముందుండి పోరాడే వారికి తొలుత వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అడుగు ముందుకేసి.. వ్యాక్సినేషన్లో సెక్స్ వర్కర్లకు తొలి ప్రాధాన్యంగా ఆదేశాలిచ్చి నాలుక కరుచుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. తీవ్రమైన వ్యతిరేకత రావటం వల్ల తమ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. కొత్త ఆదేశాల్లో సెక్స్ వర్కర్ల స్థానంలో సెలూన్ వర్కర్లుగా పేర్కొంది. తొలుత ఇచ్చిన ఆదేశాల్లో అచ్చు తప్పుగా పేర్కొంది.
ప్రాధాన్య క్రమంలో ఎవరికి వ్యాక్సిన్ అందించాలనే అంశంపై రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హై రిక్స్ కేటగిరీలో పెట్రోల్ పంప్ కార్మికులు, నిత్యావసర దుకాణదారులు, ఇంట్లో పనిచేసేవారితో పాటు సెక్స్ వర్కర్లను చేర్చింది. ఈ నోటిఫికేషన్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ విమర్శలు చేసింది కాంగ్రెస్. దీనిపై స్పందించిన నెటిజన్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
-
मध्यप्रदेश में सेक्स वर्कर को पहले वैक्सीन,
— MP Congress (@INCMP) May 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
—कहीं ये बीजेपी नेताओं की विशेष माँग पर तो नही ?
शिवराज जी,
वरीयता तय करिये पर लज्जा बनी रहे,
वैसे भी अब जनता बीजेपी नेताओं के गिरते चरित्र से भलीभाँति परिचित है।
“बेशर्म सरकार” pic.twitter.com/IIEAHoAdtO
">मध्यप्रदेश में सेक्स वर्कर को पहले वैक्सीन,
— MP Congress (@INCMP) May 30, 2021
—कहीं ये बीजेपी नेताओं की विशेष माँग पर तो नही ?
शिवराज जी,
वरीयता तय करिये पर लज्जा बनी रहे,
वैसे भी अब जनता बीजेपी नेताओं के गिरते चरित्र से भलीभाँति परिचित है।
“बेशर्म सरकार” pic.twitter.com/IIEAHoAdtOमध्यप्रदेश में सेक्स वर्कर को पहले वैक्सीन,
— MP Congress (@INCMP) May 30, 2021
—कहीं ये बीजेपी नेताओं की विशेष माँग पर तो नही ?
शिवराज जी,
वरीयता तय करिये पर लज्जा बनी रहे,
वैसे भी अब जनता बीजेपी नेताओं के गिरते चरित्र से भलीभाँति परिचित है।
“बेशर्म सरकार” pic.twitter.com/IIEAHoAdtO
ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లకు టీకా షురూ
మరోవైపు... హరియాణాలోని గురుగ్రామ్‌లో కొవిడ్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లకు టీకా పంపిణీ కోసం దుందహేరా ప్రాంతంలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటి వరకు 200 మందికి వ్యాక్సిన్ అందించారు. 'వారు హై రిస్క్ జాబితాలో ఉన్నందున వారికి వ్యాక్సిన్ అవసరం 'అని గురుగ్రామ్ సివిల్ సర్జన్ డాక్టర్ వీరేంద్ర యాదవ్ తెలిపారు. ఈ క్రమంలో జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ట్రాన్స్జెండర్లు. తొలి లాక్డౌన్లో తమకు ఎలాంటి సాయం చేయలేదని, ప్రస్తుతం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయటం వల్ల తాము కూడా సురక్షితమని భావిస్తున్నట్లు చెప్పారు.
టీకా తీసుకుంటేనే లిక్కర్..
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ఇటావా జిల్లా అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. సైఫఈ ప్రాంతంలోని మద్యం దుకాణాల్లో టీకా తీసుకుని, ధ్రువీకరణ పత్రం చూపిస్తేనే లిక్కరు విక్రయిస్తున్నారు. దుకాణాల ముందు కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికే మద్యం ఇస్తామనే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదని జిల్లా అబ్కారీ శాఖ అధికారి కమల్ కుమార్ శుక్లా తెలిపారు. జిల్లా కలెక్టర్ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని మాత్రమే సూచించారని చెప్పారు.
ఇదీ చూడండి: ఇలా అయితే.. కొవిడ్-26, కొవిడ్-32 తప్పవు!