Moustache Police Suspension: 'సింహా' మీసాలతో విధులకు హాజరైనందుకు సస్పెన్షన్ను ఎదుర్కొన్న మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రాకేశ్ రాణాను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాణాపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ఏఐజీ ప్రశాంత్ శర్మకు అతన్ని తప్పించే అధికారం లేదని పేర్కొన్నారు. అందుకే ఆ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నట్లు వివరించారు.
సస్పెన్షన్ ఎత్తివేతతో.. రాకేశ్ రాణా తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్లో మోటార్ వెహికల్ విభాగంలో డ్రైవర్‌గా చేరనున్నారు.
మీసాల కోసం..
రాణా మెడ వరకు మీసాలు, జుత్తుతో విధులు హాజరయ్యారని, వాటిని కత్తిరించమని చెప్పినప్పటికీ వినకపోవడం వల్ల సస్పెన్షన్ వేటు పడిందని ఏఐజీ ప్రశాంత్ శర్మ ఇటీవల స్పష్టం చేశారు. యూనిఫాం వేసుకున్న ఏ వ్యక్తి కూడా అటువంటి వేషధారణతో విధులకు హాజరుకారని పేర్కొన్నారు. ఈ కారణంగానే రాణాను విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'సింహా' స్టైల్ మీసంపై మోజు.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెన్షన్