తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపీ అభిషేక్ బెనర్జీని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ శనివారం నియమించారు. ఈ మేరకు టీఎంసీ సీనియర్ నేత పార్థ చటర్జీ తెలిపారు. తమ పార్టీలో ఒక సభ్యుడికి ఒకే హోదా ఉండాలని శనివారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి పార్టీ కోర్ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మేనల్లుడే ఎంపీ అభిషేక్ బెనర్జీ. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుబ్రతా బాక్షీ స్థానంలో ఆయనను తాజాగా నియమించారు. కాగా.. అభిషేక్ నిర్వర్తించిన పార్టీ యువజన విభాగం అధ్యక్ష హోదాను సయానీ ఘోష్‌కు అప్పగించారు.
మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎంసీని వీడి భాజపాలో చేరి, మళ్లీ ఇప్పుడు తమ పార్టీలోకి రావాలనుకుంటున్న ఫిరాయింపుదారులపై ఎలాంటి చర్చ జరగలేదని పార్థ చటర్జీ చెప్పారు.
ఇదీ చూడండి: ఆ లక్ష్యం ఐదేళ్ల ముందుకు: మోదీ
ఇదీ చూడండి: వెంకయ్య నాయుడు ఖాతాపై ట్విట్టర్ తికమక